Begin typing your search above and press return to search.

బ్రిటన్ లో అంబానీ కొత్త ఇల్లు.. ఎంతకు కొన్నాడో తెలుసా?

By:  Tupaki Desk   |   5 Nov 2021 9:10 PM IST
బ్రిటన్ లో అంబానీ కొత్త ఇల్లు.. ఎంతకు కొన్నాడో తెలుసా?
X
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఉత్తరాదిన గొప్పగా జరుపుకుంటారు. ముంబై వాసులు కూడా స్వీట్లు, కొత్త బట్టలు, బంగారం, నగలు, ఆస్తులు కొంటూ సందడి చేసుకుంటారు. ఇక సంపన్నులకు అయితే మరింతగా ఈ వేడుకను ఘనంగా చేస్తారు.  ఈక్రమంలోనే అంబానీ ఇంట ఈ పండుగకు మరో భారీ ఆస్తి వచ్చి చేరింది.

ప్రతీ ఏడాది దివాళీ వేడుకలను ముఖేష్ అంబానీ కుటుంబం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ముఖేష్ అంబానీ ఇంటికి వీవీఐపీలు, సెలబ్రెటీలు దివాళీ వేడుకల సమయంలో తరలి వస్తుంటారు. వారితో కలిసి వేడుకలు నిర్వహిస్తుంటారు.

కరోనా కారణంగా గత ఏడాది ముంబైలోని అంటిలియాలోనే ఉండిపోయారు. అంటిలియాలోని జామ్ నగర్ తోపాటు అటు గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ ప్రాంతంలోని ఇంట్లో అంబానీ ఉన్నారు.

ఇండియాతో పాటుగా విదేశాల్లో కూడా ఇల్లు ఉండాలని భావించిన ముఖేష్ అంబానీ కుటుంబం బ్రిటన్ లోని బకింగ్ హామ్ షైర్ లోని కౌంటీ క్లబ్ లోని స్టోక్ పార్క్ ను అంబానీ కుటుంబం కొనుగోలు చేసింది. దాదాపు 300 ఎకరాల్లో ఈ ప్యాలెస్ విస్తరించి ఉంది. ఈ ప్యాలెస్ ను అంబానీ కుటుంబం రూ.592 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్టుగా అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ ఇంట్లోనే దేవాలయాన్ని కూడా నిర్మించబోతున్నారని.. దీనికోసం ముంబై నుంచి పురోహితులను బ్రిటన్ తీసుకెళ్లారని కథనం. దీపావళి వేడుకలను అంబానీ కుటుంబం కొత్త ఇంట్లో జరుపుకుంటున్నారని అంతర్జాతీయ పత్రికల్లో పేర్కొన్నది.