Begin typing your search above and press return to search.

మళ్లీ నంబర్ 1 కుబేరుడిగా అంబానీ.. అదానీ వెనక్కి

By:  Tupaki Desk   |   10 Feb 2022 1:30 AM GMT
మళ్లీ నంబర్ 1 కుబేరుడిగా అంబానీ.. అదానీ వెనక్కి
X
దేశంలో ఇప్పుడు కుబేరులో పోటీ నెలకొంది. దేశంలోనే సంపన్నులైన అంబానీ, అదానీలు దేశంలోనే మొదటి స్థానం కోసం పోటీపడుతున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో ఏషియాలోనే అత్యంత దనవంతుడిగా గౌతమ్ అదానీ ఇటీవల చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే అదానీ ఆశ ఒక్కరోజులోనే కరిగిపోయింది. ఆయన ఆ నంబర్ 1 స్థానంలో ఒక్కరోజు మాత్రమే ఉండగలిగారు.

24 గంటలు గడిచేసరికి ముఖేష్ అంబానీ మరోసారి దూసుకువచ్చిన తన మొదటి స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఇద్దరి సంపదలో తేడా రావడంతో ముఖేష్ నంబర్ 1 స్థానానికి మళ్లీ చేరుకున్నారు.

ఆసియాలో ఇప్పుడు అదానీ నంబర్ 2 స్థానంలో ఉండగా ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నారు. ఇక ఆసియాలో ముఖేష్ అంబానీ నంబర్ 1 కుబేరుడిగా మళ్లీ పైకి వచ్చాడు. 2022 ఫిబ్రవరి 9 బుధవారం ఉదయం బ్లూంబర్గ్ ఇండెక్స్ జాబితాలో ముఖేష్ అంబానీ సంపద 89.2 బిలియన్ డాలర్లకు గాను నమోదైంది. క్రితం రోజు ఆయన సంపద విలువ 87.9 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఇక గౌతం అదానీ సంపద 86.3 బిలియన్ డాలర్లుగా ఉంది. మునపటి జాబితాలో ఈ మొత్తం 88.5 బిలియన్లుగా ఉండేది. కేవలం ఒక్క రోజు వ్యవధిలో ముఖేష్ సంపదలో 1.33 బిలియన్ డాలర్లు వచ్చి జమ అవ్వగా.. అదానీ ఖాతా నుంచి 2.16 బిలియన్ డాలర్లు కరిగిపోయాయి. దీంతో ముఖేష్ అంబానీ మళ్లీ ఆసియాలో నంబర్ 1 స్థానంతోపాటు ప్రపంచ కుబేరుల్లో పదోస్థానానికి మరోసారి చేరుకున్నారు.

బ్లూంబర్గ్ జాబితాలో అంబానీ 10వ స్థానంలో.. అదానీ 11వ స్థానాల్లో ఉండగా.. టాప్ 100 జాబితాలో 38వ స్థానంలో అజీమ్ ప్రేమ్ జీ (33.8 బి.డాలర్లు), 48వ స్థానంలో శివ్ నాడర్ (29 బి.డా),79వ స్థానంలో రాధాకిషన్ దమానీ (21.2 బి.డా), 82వ స్థానంలో లక్ష్మీ మిట్టల్ (21 బి.డా)లు ఉన్నారు.