Begin typing your search above and press return to search.

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ ఏదంటే?

By:  Tupaki Desk   |   20 Jan 2023 6:00 AM IST
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ ఏదంటే?
X
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి నిలిచింది. గతేడాది యాపిల్ సంస్థ టాప్ లో నిలువగా ఈసారి మాత్రం అమెజాన్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆ సంస్థ విలువ సుమారు 15 శాతం మేర తగ్గినప్పటికీ అమెజాన్ కంపెనీనే అత్యంత విలువైన బ్రాండ్ గా నిలవడం విశేషం.

గతేడాది అమెజాన్ సంస్థ విలువ 350.3 బిలియన్ డాలర్లు ఉండగా ప్రస్తుతం దాని విలువ 299.3 బిలియన్ డాలర్లుగా ఉందని బ్రాండ్ వ్యాల్యూ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ 'గ్లోబల్ 500 2023' ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది అమెజాన్ విలువ సుమారు 50 బిలియన్ డాలర్లు తగ్గి రేటింగ్ ఎఎఎ ప్లస్ నుంచి ఎఎఎ చేరుకుందని ప్రకటించింది.

అదే సమయంలో అమెజాన్ సేవల పట్ల కస్టమర్ల దృక్పథం మారిందని.. డెలివరీ సమయం సైతం పెరిగిందని బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. మరోవైపు ఈ జాబితాలో యాపిల్ సంస్థ రెండో స్థానానికి పడిపోయింది. గతేడాది యాపిల్ సంస్థ విలువ 355 బిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది 16 శాతం తగ్గి 297.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

యాపిల్ సంస్థ విలువ క్షీణతకు ప్రధానంగా సప్లై ఛైన్‌లో అవరోధాలు ఏర్పడటమే కారణమని 'గ్లోబల్ 500 2023’ నివేదికలో పేర్కొంది. కాగా 2022 నివేదికలో టాప్ 50లో నిలిచిన స్నాప్‌చాట్.. ట్విట్టర్‌ ఈసారి జాబితాలో తమ స్థానాలను కోల్పోయాయి. అదేవిధంగా శాంసంగ్.. అలీబాబా.. ఫేస్‌బుక్.. వియ్‌చాట్ సంస్థలు సైతం తమ విలువను భారీగా కోల్పోయినట్లు పేర్కొంది.

కాగా ఇన్‌స్టాగ్రామ్.. లింక్డిన్ తమ బ్రాండ్ విలువను భారీగా పెంచుకున్నాయని 'గ్లోబల్ 500 2023’ పేర్కొంది. ఎలక్ట్రానికి వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టెస్లా.. బీవైడీ కంపెనీలు బ్రాండ్ వాల్యూను పెంచుతున్నట్లు వెల్లడించింది. అలాగే భారత్ చెందిన పలు కంపెనీలు సైతం 'గ్లోబల్ 500 2023' జాబితాలో చోటు సంపాదించుకొని సత్తా చాటాయి.

భారత్ నుంచి టాప్ ప్లేస్ లో టాటా గ్రూప్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది 78వ స్థానంలో నిలిచిన టాటా ఈసారి 69కి ఎగబాకింది. అదేవిధంగా ఐటీ రంగానికి చెందిన ఇన్పోసిస్ 158 వ స్థానం నుంచి 150కి చేరింది. ఈ సంస్థ బ్రాండ్ విలువ 2020 నుంచి 84 శాతం మేర పెరిగినట్లు 'గ్లోబల్ 500 2023’ నివేదించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.