Begin typing your search above and press return to search.

పండుగ ఆఫర్.. 1.4 లక్షల ఉద్యోగాలు

By:  Tupaki Desk   |   25 Sep 2019 6:40 AM GMT
పండుగ ఆఫర్.. 1.4 లక్షల ఉద్యోగాలు
X
దేశంలో దసరా - దీపావళి పండుగలే అతిపెద్ద సీజన్. ఇప్పుడే వ్యాపారులు - వివిధ సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తుంటాయి. వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. ఇప్పటికే కార్పొరేట్ దిగ్గజాలు కూడా రంగంలోకి దిగాయి.. దేశంలోనే అతిపెద్ద ఈకామర్స్ వెబ్ సైట్లు అయిన అమేజాన్ - ఫ్లిప్ కార్ట్ లు ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు దాదాపు 20-80శాతం వరకూ అతిపెద్ద ఆఫర్లను ప్రకటించాయి. వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి.

మరి దేశవ్యాప్తంగా కోట్ల మంది కొనుగోలు చేసే వస్తువులను ఎలా సరఫరా చేయాలి? పండుగకు ఎలా అందించాలి? అందుకే అమేజాన్ - ఫ్లిప్ కార్ట్ లో ఈ పండుగ సీజన్ కోసమే తాత్కాలికంగా ఏకంగా 1.4 లక్షల ఉద్యోగులను నియమించుకున్నాయి. అమేజాన్ 90వేల మందిని - ఫ్లిప్ కార్ట్ 50వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపాయి. వీరంతా గిడ్డంగుల నుంచి వినియోగదారుల సేవా కేంద్రాల వరకూ వివిధ స్థాయిల్లో పనిచేస్తారని తెలిపింది. పండుగ సీజన్ తర్వాత గిరాకీ ఉండదు కాబట్టి వీరిని తొలగిస్తారు. అయితే ఈనెల రోజుల్లోనే వారికి భారీగా జీతాలిచ్చి సంస్థలు తమ ఉత్పత్తులను అమ్ముకుంటాయి.

ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 750 నగరాల్లో 1400 డెలివరీ కేంద్రాలతో అమేజాన్ ముందంజలో ఉంది. ఫ్లిప్ కార్ట్ కూడా భారీగా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

అయితే ఈ ఈకామర్స్ వల్ల దేశీయ రిటైర్ రంగం - రిటైల్ వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. ప్రధాన నగరాల్లో అంతా ఆన్ లైన్ షాపింగ్ చేస్తుండడంతో గిరాకీ లేక షాపులు మూసుకుంటున్నారు.ఇక గిరాకీ లేక భారీగా ఉండే అద్దెలను కూడా చెల్లించలేని స్థితిలో వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి ప్రత్మామ్మాయంగా కొందరు వ్యాపారులు నగరాల్లో షాపులు కట్టేసి చిన్నపట్టణాలకు వెళ్లి అక్కడ షాపులు ఓపెన్ చేస్తున్నారు. చిన్న పట్టణాల్లో అమేజాన్ - ఫ్లిప్ కార్ట్ సేవలు లేకపోవడంతో అక్కడ రిటైల్ వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు.