Begin typing your search above and press return to search.

ఈ విపత్తులోనూ బిలియన్లు సంపాదించిన ధనవంతులు వీరే

By:  Tupaki Desk   |   23 May 2020 2:30 AM GMT
ఈ విపత్తులోనూ బిలియన్లు సంపాదించిన ధనవంతులు వీరే
X
మహమ్మారి దెబ్బకు విధించిన లాక్ డౌన్ తో ప్రపంచవ్యాప్తంగా అందరి ఉద్యోగ, ఉపాధి పోయింది. రూపాయి సంపాదన లేక అంతా రోజులు లెక్కబెట్టుకున్నారు. కానీ ఇంతటి క్లిష్ట సమయంలో కోట్లకు కోట్లు సంపాదించారు ఈ ధనవంతులు.. లాక్ డౌన్ సమయంలోనూ అమెరికాలోని బిలయనీర్ల ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. పైగా పెరగడం అందరినీ షాక్ కు గురిచేసింది.

మార్చి మధ్య నుంచి వైరస్ వ్యాప్తి మొదలైంది. అప్పుడే అన్ని దేశాలు లాక్ డౌన్ విధించాయి. మే నెల మధ్య వరకు ఇది కొనసాగింది. ఈ మధ్య కాలంలో అందరూ ఇంట్లోనే ఉండి సంపాదన కోల్పోయారు. ప్రభుత్వాలు ఆర్థిక విచ్చిత్తితో కుప్పకూలాయి. కానీ అమెరికా బిలియనీర్ల ఆదాయం మాత్రం కళ్లు చెదిరేలా 434 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం.

‘ట్యాక్స్ ఫెయిర్ నెస్, ఇన్ స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ ప్రోగ్రామ్ ఫర్ ఇక్వాలిటీ’ అనే నివేదిక తాజాగా ఈ విషయాలను వెల్లడించింది. అమెజాన్ చీఫ్ జెఫ్ బోజెస్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ లు అత్యధిక లాభాలను అర్జించారని సంస్థ వెల్లడించింది.

అమెజాన్ జెఫ్ బోజెస్ సంపద ఏకంగా 34.6 బిలియన్ డాలర్లు పెరగగా.. ఫేస్ బుక్ జుకర్ బర్గ్ సంపద ఏకంగా 25 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ప్రపంచ చరిత్రలోనే కనివినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంతో దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నా ఈ మహమ్మారి పెద్ద ఎత్తున ప్రాణాలు తీస్తున్నా కూడా బిలియనీర్లు లాభాలను అర్జించడం విశేషం.

అమెరికా బిలియనీర్ల సంపద ఈ రెండు నెలల కాలంలో 15శాతం పెరిగి 2.948 ట్రిలియన్ డాలర్ల నుంచి 3.382 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే ఐదుగురు ధనవంతులు బెజోస్, బిల్ గేట్స్, జుకర్ బర్గ్, వారెన్ బఫెట్ , లారీ ఎల్లిసన్ సంపదలు కలిపి మొత్తం 76 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. అందరికంటే ఎక్కువగా ఈ రెండు నెలల్లో ఎలోన్ మస్క్ అనే బిలియనీర్ అత్యధిక శాతం లాభాలు అర్జించాడని సంస్థ తెలిపింది. అతడి ఆస్తుల విలువ 48 శాతం పెరగడం విశేషం.