Begin typing your search above and press return to search.
జనవరి 7 వరకు అద్భుతమైన ముహుర్తాలు... పెళ్లిళ్లే పెళ్లిళ్లు..!
By: Tupaki Desk | 10 Nov 2020 6:00 AM ISTఒకవైపు కరోనా కోరలు చించుకొని కూర్చొని ఉంది.. మరోవైపు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలోనే కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన తర్వాత ,పెళ్లిళ్లు పూర్తిగా ఆగిపోయాయి. కరోనా మహమ్మారి పెరిగిపోతున్న నేపథ్యంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు ఎవరు పెద్దగా ఆసక్తి చూపలేదు. అలాగే ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వలేదు. ఇక ఈ మద్యే మళ్లీ ప్రభుత్వం పెళ్లిళ్లు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం తో మల్లి పెళ్లిళ్ల శోభ కనిపిస్తుంది. జనవరి 7 వరకు భారీగా ముహుర్తాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. ఆ తర్వాత 4 నెలలు మూడాలు ఉండటంతో ఇప్పుడే పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడం , మళ్లీ సెకండ్ వేవ్ మొదలు అవుతుంది అనే అనుమానం కూడా ఉండటంతో ఈ రెండు నెలల్లో ఉండే ముహూర్తాలకే ఫిక్స్ అవుతున్నారు.
నవంబర్ నెలలో 1,3,6,9,10,11,13,14,15,20,21,22,30 తేదీలలో మంచి ముహుర్తాలు ఉన్నాయి. అలాగే , డిసెంబర్ నెలలో 1,2,5,6,7,8,11,12 తేదీలలో వివాహ ముహుర్తాలు ఉన్నాయి.ఈ శుభముహుర్తాలే కాక మరికొన్ని నామం, నక్షత్రాలను బట్టి ముహుర్తాలు పెట్టుకోవచ్చన్నారు.కరోనా ఎఫెక్ట్తో ఇన్నాళ్లు పెండ్లీలకు వెళ్లడానికి భయపడిన జనాలు ఇప్పుడు మాత్రం పిలవగానే వెళ్లిపోతున్నారు. కరోనా నేపథ్యంలో పెండ్లీలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తప్పనిసరగా మాస్క్ ధరిస్తున్నరు. వివాహ వేదిక ప్రాంగణాల్లోనే శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు. జనం కూడా వీలైనంత వరకు ఫిజికల్ డిస్టేన్స్ పాటిస్తున్నారు. ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఐదారు నెలలుగా పెండ్లి అనుబంధ పరిశ్రమ అతలాకుతలం అయ్యింది. మ్యారేజ్ హాళ్ల ఓనర్లు, ఈవెంట్ మేనేజర్లు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, క్యాటరర్స్, డెకరేషన్ వర్కర్స్ వరకు అందరూ నష్టపోయారు. ఇప్పుడు మళ్ల పెండ్లీలు ఎక్కువగా జరుగుతుండటంతో ఆ వ్యాపారాలు ఊపందుకుంటున్నయి. ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు, హోటళ్లలో వేదికలు, డెకరేషన్, ఫొటోగ్రఫీ, క్యాటరింగ్ తదితర అన్నింటికి బుకింగ్‌లు జరుగుతున్నాయి.