Begin typing your search above and press return to search.

తిరుప‌తి అమ‌రావ‌తి రైతుల‌ స‌భ .. హైకోర్టు అనుమ‌తి

By:  Tupaki Desk   |   15 Dec 2021 3:31 PM GMT
తిరుప‌తి అమ‌రావ‌తి రైతుల‌ స‌భ .. హైకోర్టు అనుమ‌తి
X
అమరావతి రైతులు చేప‌ట్టిన న్యాయస్థానం నుంచి దేవ‌స్తానం వ‌ర‌కు మ‌హా పాద‌యాత్ర ముగిసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పాద‌యాత్ర అనంత‌రం.. తిరుప‌తి వేదిక‌గా.. ఈ నెల 17న బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. ప్ర‌బుత్వం నుంచి వివిధ కార‌ణాలు చూపుతూ.. స‌భ‌కు అనుమ‌తించ‌లేదు. దీంతో ఈ విష‌యంపై రైతులు కోర్టుకు వెళ్లారు. రైతుల పిటిష‌న్‌ను విచారించిన న్యాయ‌స్థానం... తిరుప‌తిలో సభకు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సభ నిర్వహించుకోవాలని ఆదేశించింది.

అదేస‌మ‌యంలో కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ సభ జరుపుకోవాలని కోర్టు సూచించింది. అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం సభకు అనుమతి ఇవ్వాలని పరిరక్షణ తరపు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ కోర్టు ధర్మాసనాన్ని కోరారు. మ‌రో వైపు ఈ సభకు అనుమతి ఇవ్వడం వల్ల రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది సుధాకర్‌రెడ్డి కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలను విన్న కోర్టు రైతులు సభ నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తిరుపతి రూరల్ పరిధిలో జేఏసీ బహిరంగ సభ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంటల నుండి 6 వరకు సభకు అనుమతి. లా&ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందన్న ప్రభుత్వ తరపున న్యాయవాది వాదనలను కొట్టేసిన న్యాయ‌మూర్తి.. అయితే.. పాదయాత్ర సమయంలో పోలీసులపై అమరావతి రైతులు దాడి చేశారని.. వీడియో ఫుటేజ్ చూపించిన ఏఏజీ. ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న న్యాయ‌మూర్తి ప్రవేట్ ప్రదేశంలో సభను నిర్వహించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అయితే.. ఒమిక్రాన్ కేసుల ఉన్న నేపధ్యంలో సభకు అనుమతిచలేదని అడిషనల్ ఏజీ.. తెలిపారు. అయిన‌ప్ప‌టికీ.. అనుమ‌తించాల‌ని సూచించిన కోర్టు.

అదేస‌మ‌యంలో బహిరంగ సభలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు సూచించింది. నిబంధనలకు లోబడి బహిరంగ సభను నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాల‌ని పోలీసుల‌కు తెలిపింది. అదేస‌మ‌యంలో శాంతి భద్రతలకు విఘాతం ,ప్రభుత్వం అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయావద్దని రైతుల‌కు హైకోర్టు స్ప‌ష్టం చేసింది. మరోవైపు.. రాయ‌ల‌సీమ హ‌క్కుల పై నిర్వ‌హించ త‌ల‌పెట్టిన స‌భ‌ను 18వ తేదీ నిర్వ‌హించుకోవాల‌ని హైకోర్టు సూచించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఇటురైతుల‌కు, అటు రాయ‌ల‌సీమ ప్ర‌తినిధుల‌కు కూడా హైకోర్టు నుంచి ఊర‌ట ల‌భించింది.