Begin typing your search above and press return to search.

అమరావతి ప్రాంతంలో లోకేశ్ ను స్థానికులు ఎందుకు అడ్డుకున్నట్లు?

By:  Tupaki Desk   |   13 Oct 2020 11:30 AM IST
అమరావతి ప్రాంతంలో లోకేశ్ ను స్థానికులు ఎందుకు అడ్డుకున్నట్లు?
X
ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ ఎమ్మెల్సీ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేవ్ కు చేదు అనుభవం ఎదురైంది. అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటనను అక్కడి స్థానికులు అడ్డుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గడిచిన కొంతకాలంగా ఆందోళనలు.. నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలు 300 రోజులు పూర్తి అవుతున్న వేళ.. పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహించాలని భావించారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున మహిళల్ని గ్రామాల నుంచి తీసుకెళుతున్నారు.ఈ క్రమంలో మహిళల్నితీసుకెళుతున్న ట్రాక్టర్.. ఒక మహిళను ఢీ కొని ఆమె మరణానికి కారణమైంది.

దీంతో.. మరణించిన మహిళ కుటుంబీకుల్ని పరామర్శించేందుకు లోకేశ్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు లోకేశ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. లోకేశ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దొండపాడులో చోటు చేసుకున్న ఈ పరిణామంతో ఆయన అవాక్కు అయ్యారు. తమకు తిరుగులేదనుకునే ప్రాంతంలో తనను అడ్డుకునే ప్రయత్నం చేయటాన్ని చినబాబు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.