Begin typing your search above and press return to search.

అమరరాజా బ్యాటరీస్ నిర్వాకం.. 26 ఎకరాల అటవీభూమి కబ్జా?

By:  Tupaki Desk   |   26 Aug 2021 9:03 AM IST
అమరరాజా బ్యాటరీస్ నిర్వాకం.. 26 ఎకరాల అటవీభూమి కబ్జా?
X
గుంటూరు ఎంపీ కమ్ అమరరాజా బ్యాటరీస్ అధినేత అయిన గల్లా కుటుంబానికి సంబంధించిన షాకింగ్ అంశం ఒకటి బయటకు వచ్చింది. చిత్తూరు జిల్లాలోని వీరి సంస్థ.. అటవీశాఖ భూమిని భారీగా ఆక్రమించినట్లుగా గుర్తించారు. దాదాపు 21 ఎకరాల వరకు ఈ భూమి ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ అటవీ శాఖ అధికారుల అంచనా ప్రకారం చిత్తూరు జిల్లా కరకంబాడీ పంచాయితీ పరిధిలోని అమరరాజా బ్యాటరీస్ కు సంబంధించిన భూమిలో 8.4 ఎకరాల అటవీ భూమి కలిసి ఉందని అగుర్తించారు. ఈ సంస్థకు 2000లో అప్పటి టీడీపీ ప్రభుత్వం10.87 ఎకరాల అటవీ భూమిని అప్పజెప్పింది. ఇలా ఇచ్చిన భూమికి అదనంగా మరో ఎనిమిది ఎకరాలకు పైనే అక్రమించేసినట్లుగా అంచనా వేస్తున్నారు.

కరకంబాడి గ్రామంలో ఏర్పాటు చేసిన సంస్థకు చెందిన భవనానికి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించింది అమరరాజా కంపెనీ. ఇందులోనే ఈ ఎనిమిది ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైనట్లుగా భావిస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అమరరాజాకు అటవీభూమిని ఇచ్చినా.. కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం అనుమతులు రాలేదు. ఇదే కాకుండా కరకంబాడి గ్రామంలోనే మరో 18 ఎకరాల అటవీ భూమిని సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇది కూడా గల్లా కుటుంబానికి చెందిన మంగళ ఇండస్ట్రీస్ పేరుతో చేసినట్లు తెలుస్తోంది.

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లో.. దీనికి సంబంధించిన కేటాయింపులు జరిగినట్లుగా తెలుస్తోంది. 2015-16లో మంగళ ఇండస్ట్రీస్ కు 21 ఎకరాలను కొనుగోలు చేస్తే.. అందులో అటవీ శాఖకు సంబంధించి 18 ఎకరాలు ఉన్నట్ులగా చెబుతున్నారు. ఈ భూమిని 1979లో ఎస్సీల కోసం అసైన్ చేసి ఉంచారు. అయితే.. భూముల కొనుగోలు విషయంలో నిషేధం ఉన్నప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా టీడీపీ ప్రభుత్వం ఓకే చెప్పేయటం విమర్శలకు దారి తీస్తోంది. ఇలా పెద్ద ఎత్తున అటవీ శాఖకు చెందిన భూమిని అక్రమించిన గల్లా కుటుంబంపై ఏపీలోని జగన్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.