Begin typing your search above and press return to search.

ఆ మాజీ సీఎం గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు

By:  Tupaki Desk   |   18 May 2016 11:30 AM IST
ఆ మాజీ సీఎం గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు
X
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గ‌వచ్చ‌నేందుకు ఎన్నో ఉదాహార‌ణ‌లున్నాయి. ఇందులో తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం తెర‌మీద‌కు వ‌చ్చింది. సమాజ్‌ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ - ఆ పార్టీకి చెందిన అగ్ర‌నేత అమర్ సింగ్‌ కు కొద్దికాలం క్రితం వ‌ర‌కు అత్యంత స‌ఖ్య‌త ఉండేది. కానీ అది బెడిసికొట్ట‌డంతో ఎస్పీ నుంచి అమ‌ర్‌ సింగ్‌ బహిష్కరణకు గురయ్యారు. అనంత‌రం అమర్ కొన్నాళ్లకు 'ర్రాష్టీయ లోక్ మంచ్' పేరుతో సొంత పార్టీని స్థాపించారు. జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ ఆయనకు అంతగా కలసి రాకపోవడంతో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ ఎల్డీ) లో చేరారు. అక్కడా కలిసిరాక చివరకు ఎస్పీలో చేరారు. ఇన్ని క‌ష్టాలు ప‌డ్డ పాత దోస్తుకు ములాయం తాజాగా భారీ న్యాయం చేశారు.

వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జూన్‌ లో జరిగే రాజ్యసభ ఎన్నికలకు ఈసారి ఉత్తర ప్రదేశ్ నుంచి మొత్తం 11 మందిని ఎన్నుకోవాలి. అసెంబ్లీలో బలాన్ని బట్టి సులభంగా ఆరు సీట్లు సమాజ్ వాదీకి దక్కనున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌మాజ్ వాదీ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడుగా అమర్ సింగ్ మరోసారి పార్లమెంట్‌ లో అడుగుపెట్టనున్నారు. ఎస్పీ పార్లమెంటరీ బోర్డు లక్నోలో సమావేశమై అమ‌ర్‌ సింగ్‌ కు ఎంపీగా మళ్లీ ఛాన్స్ ఇచ్చింది.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులుగా అమర్ సింగ్‌ తో పాటు బేణీ ప్రసాద్ - సంజయ్ సేథ్ - శుక్‌ రాం యాదవ్ - విశ్వంభర్ ప్రసాద్ నిశీద్ - అరవింద్ సింగ్ - రేవతి రామన్ సింగ్ పేర్లను ప్రకటించింది. కాగా సమాజ్‌ వాదీ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన దాదాపుగా ఆరేళ్ల తరువాత అమ‌ర్‌ సింగ్ తిరిగి సొంత గూటికి చేరారు.