Begin typing your search above and press return to search.

మా ఇద్దరి బంధం గురించి చెప్పినా ఆపరా..?

By:  Tupaki Desk   |   2 Feb 2019 5:08 AM GMT
మా ఇద్దరి బంధం గురించి చెప్పినా ఆపరా..?
X
సినీ నటి జయప్రద అలనాటి చిత్రాల్లో మహామహానటులతో నటించారు. ఎన్టీఆర్‌తో సమానంగా స్టెప్పులు వేశారు. సినిమాల్లో తక్కువైన సందర్భంలో ఆమె రాజకీయాల్లో చేరారు. ఎన్టీఆర్‌ సినిమాల్లో నుంచి రాజకీయంలో చేరినప్పుడు ఆయన ఆహ్వానం మేరకు జయప్రద కూడా 1994లో టీడీపీలో చేరారు. ఆ తరువాత చంద్రబాబు హయాంలో మహిళా అధ్యక్షురాలిగా కొనసాగారు. ఆ తరువాత వచ్చిన విభేదాలతో ఉత్తరప్రదేశ్‌ లోని సమాజ్‌ వాది పార్టీలో చేరారు. రాంపూర్‌ నియోజకవర్గం నుంచి 2004లో ఎంపీగా ఎన్నికయ్యారు.

ఇటీవల జయప్రద పేరు సోషల్‌ మీడియాలో మారు మోగుతోంది. ఆమె పార్టీలోని అమర్‌ సింగ్‌ తో మొదటి నుంచి సన్నిహితంగానే ఉంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఏదో ఉందని కొందరు రకరకాల వార్తలు రాశారు. కొన్ని రోజులు ఈ విషయాలపై ఆమె పట్టించుకోలేదు. తాజాగా ఈ న్యూస్‌ పై జయప్రద స్పందించారు. అమర్‌ సింగ్‌ తో తనకు ఉన్న బంధాన్ని తేల్చింది.

ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ 'అమర్‌ సింగ్‌ గారితో తనకున్న బంధంపై కొందరు ఏవేవో వార్తలు రాస్తున్నారు. నేను కొన్ని సార్లు మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని చెప్పినా ఆ వార్తలు ఆగడం లేదు. నేను అమర్‌ సింగ్‌ కు రాఖీ కట్టిన బంధం అని చెప్పినా నాపై ఇలాంటి వార్తలు రాయడం చాలా బాధాకరం. తనకు గాఢ్‌ ఫాదర్‌ లాంటి వ్యక్తితో ఇలా పోల్చడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.'

'అజంఖాన్‌ తో నేను చాలా సఫర్‌ అయ్యాను. తనపై యాసిడ్‌ పోస్తామని కూడా బెదిరించారు. అలాగే తన ఫొటోలను మార్పించ్‌ చేసి నగ్న చిత్రాలను విడుదల చేశారు. ఆ సమయంలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ అమర్‌ సింగ్‌ నాకు చాలా ధైర్యం చెప్పారు. ఇలాంటి సమయంలో ఆదుకునే దేవుడిగా భావించే వ్యక్తితో ఇలా పోల్చడం సరికాదు' అంటూ జయప్రద ఆవేదన చెందారు.