Begin typing your search above and press return to search.

ఆమంచి ఏ అర్హతతో ప్రారంభిస్తారు..? ఇదేంటి!

By:  Tupaki Desk   |   2 Oct 2019 3:22 PM GMT
ఆమంచి ఏ అర్హతతో ప్రారంభిస్తారు..? ఇదేంటి!
X
చీరాల నియోజకవర్గంలో కొత్తపాలెం - కొత్తపేటల్లో నూతనంగా ఏర్పాటు అయిన గ్రామ సచివాలయాలను అక్కడి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. ఆయన అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా కూడా ఉన్నారు. ఉంటే ఉన్నారు.. అయితే అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నా తప్పేం లేదు కానీ - ఆయన ప్రారంభించడం ఏమిటి? అనేదే అసలైన ప్రశ్న.

చీరాల నియోజకవర్గం ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో ఆమంచిని ఓడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి గట్టిగా ఉన్న సమయంలో - జగన్ హవాలో కూడా చీరాల్లో ఆమంచి గెలవలేకపోయారు. అంతకు ముందు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానే నెగ్గిన ఆమంచి.. ఈ సారి జగన్ హవా ఉన్నా నెగ్గలేకపోయారు. ఆమంచి స్థానంలో వేరే ఎవరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినా.. నెగ్గే వారని స్థానికులు అంటున్నారు.

ఆమంచిని చేర్చుకుని వైఎస్ జగన్ పొరపాటే చేశారని అంటున్నారు. అంత వరకూ ఇన్ చార్జిగా ఉండిన వ్యక్తిని పోటీ చేయించి ఉంటే.. సులువుగా నెగ్గేసేవాడని - ఆమంచికి తెలుగుదేశం టికెట్ ఇచ్చి ఉంటే అక్కడ వైసీపీ జెండా పాతేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అలా పార్టీ హవాలో కూడా ప్రజల చేత తిరస్కరణ పొందిన ఆమంచి కృష్ణమోహన్ ఇలా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు.

ఇది మరింత వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. సాధారణంగా ప్రతిపక్షానికే చెందినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం పద్ధతి. తెలుగుదేశం పార్టీ గ్రామ సచివాలయాలను వ్యతిరేకిస్తూ ఉండొచ్చు గాక.. అయినా ఎమ్మెల్యే పాల్గొనడమే సమంజసం. అయితే ఇలా అధికార పార్టీకి చెందిన ఓడిపోయిన వ్యక్తి అధికారిక కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించేయడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఓడిపోయిన వ్యక్తి ఇలాంటి పనులను తగ్గించుకుంటే మంచిదని చురకలు అంటిస్తూ ఉన్నారు.