Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌లో టీడీపీ కోవ‌ర్టులు !

By:  Tupaki Desk   |   20 March 2019 5:46 PM GMT
జ‌న‌సేన‌లో టీడీపీ కోవ‌ర్టులు !
X
జ‌న‌సేన నిర్ణ‌యాల‌ను పార్టీ నేత‌ల‌ను విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు చూస్తుంటే... అవి టీడీపీకి క‌లిసొచ్చేలా ఉండ‌టం పార్టీలో చాలామందిక న‌చ్చ‌డం లేదు. దీనికి తాజా ఉదాహ‌ర‌ణ విశాఖ‌ప‌ట్నం జిల్లా మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ జ‌న‌సేన అభ్య‌ర్థి ఎంపిక త‌ర్వాత పార్టీ విధానాల‌పైనే అనుమానాలు క‌లిగే ప‌రిస్థితి. ఎందుకో తెలుసుకుందాం.

ఒక పార్టీలో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యులు ఉండొచ్చు. కానీ ఒకే కుటుంబ స‌భ్యులు రెండు వేర్వేరు పార్టీల్లో ఉండ‌టం కొంచెం అనుమానాస్ప‌ద‌మే. అందునా ర‌హ‌స్య ఒప్పందం ఉంద‌ని భావిస్తున్న టీడీపీ-జ‌న‌సేన పార్టీల్లో ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌త్య‌ర్థులుగా పోటీ చేయ‌డంతో అంద‌రికీ డౌటొచ్చింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ టిక్కెట్ జి.రామానాయుడుకు ద‌క్కింది. ట్విస్ట్ ఏంటంటే... రామానాయుడు తమ్ముడు సన్యాసినాయుడుకు జనసేన టికెట్ ఇచ్చింది. ఇది ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు తీసుకెళ్తుంద‌ని - పార్టీకి మొద‌టికే మోసం వ‌స్తుంద‌నేది పార్టీ నేతల ఆగ్ర‌హం - ఆవేద‌న‌.

ఈ వ్య‌వ‌హారంపై మాజీ ఎమ్మెల్యే - జనసేన నాయకురాలు అల్లు భానుమతి తీవ్రంగా స్పందించారు. జనసేన - టీడీపీ మ‌ధ్య ర‌హ‌స్య బంధం ఉంద‌ని జ‌నం న‌మ్మేలా రెండు పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ఆమె అన్నారు. ప‌రిణామాలు గ‌మ‌నిస్తుంటే... జనసేనలో టీడీపీ కోవర్టులున్నారని అర్థ‌మ‌వుతోంద‌ని ఆమె ఆరోపించారు. చూస్తుంటే... ఎన్నికల ముందు లేదా త‌ర్వాత రెండు పార్టీలు క‌లిసేలా ఉన్నాయ‌ని...ఇలాగే ఉంటే ప్ర‌జ‌లు మోసాన్ని గుర్తించ‌కుండా ఉండ‌లేర‌ని అన్నారు. ప్ర‌జ‌లు గుడ్డోళ్లు కార‌ని... దొంగ ప్లాన్లు వేస్తే న‌ట్టేట వ‌దిలేస్తార‌ని అన్నారు. ప్రజలు అమాయకులని అనుకుంటున్నారా... పార్టీ మునగ‌డ‌మే కాకుండా ఇలాంటి నిర్ణ‌యాల వ‌ల్ల పార్టీ నమ్ముకుని మేము - పార్టీని న‌మ్మిన ప్ర‌జ‌లు ఇద్ద‌రూ న‌ష్ట‌పోతార‌న్నారు. పార్టీ తీసుకున్న‌ ఈ నిర్ణ‌యం త‌న‌ను క్షోభ‌కు గురిచేసింద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తంచేశారు. అస‌లు నారా లోకేష్ నిల‌బ‌డిన చోట క‌మ్యూనిస్టుల‌కు టిక్కెట్ కేటాయించడంతోనే జ‌న‌సేన గుట్టుర‌ట్ట‌యిపోయింద‌ని - ప్ర‌జ‌లు గుర్తించార‌ని ఆమె ఆరోప‌ణ‌లు చేశారు.