Begin typing your search above and press return to search.
రాజమండ్రికి బన్నీ.. పవన్ కలిసేందుకు పయనం
By: Tupaki Desk | 9 April 2019 12:56 PM ISTజనసేన పార్టీకి లేఖలు విడుదల చేసి బహిరంగ మద్దతు పలికిన మెగా హీరో అల్లు అర్జున్.. కానీ పవన్, నాగబాబు కోసం మాత్రం నియోజకవర్గాల్లో దిగి ఫిజికల్ గా ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు చూస్తే బన్నీ జనసేన తరుఫున ప్రచారం చేసేలానే కనిపిస్తున్నారు.
తాజాగా అల్లు అర్జున్ కొద్ది సేపటి క్రితమే రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో దిగారు. బన్నీకి జనసైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడి నుంచి పవన్ పాలకొల్లుకు బయలు దేరారు. పవన్ కళ్యాణ్ ను కలుసుకొని పరామర్శించనున్నారు. అలాగే నాగబాబు తరుఫున బన్నీ ప్రచారం చేస్తారని సమాచారం. నిన్ననే రాంచరణ్ ప్రచారానికి రాగా పవన్ అనుమతించారు. ఇప్పుడు బన్నీ కూడా వస్తుండడంతో జనసేన పార్టీకి ఫుల్ జోష్ వచ్చేసింది..
అయితే పవన్ కళ్యాన్ తరుఫున అల్లు అర్జున్ భీమవరంలో ప్రచారం చేసే అవకాశాలైతే కనిపించడం లేదని సమాచారం. నాగబాబుతో కలిసి నర్సాపురం పరిధిలో తిరిగి ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. నాగబాబు తరుఫున అల్లు అరవింద్ కూడా వచ్చి ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అల్లు అర్జున్, అరవింద్ వస్తే మాత్రం నర్సాపురంలో నాగబాబుకు హైప్ వచ్చే అవకాశాలు ఉంటాయని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.
అయితే మరో ఎండ్ లో మాత్రం మెగా హీరోలు ఇలా చివర్లో రావడంపై అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. ప్రచారం ముగిసే రోజున ఇలా రావడం జనసేనకు హెల్ప్ అవుతుందా అని మథనపడుతున్నారు.