Begin typing your search above and press return to search.

బ‌న్నీ కారు డ్రైవ‌ర్ అలా చేశాడ‌ట‌

By:  Tupaki Desk   |   15 May 2017 5:23 AM GMT
బ‌న్నీ కారు డ్రైవ‌ర్ అలా చేశాడ‌ట‌
X
స్టైలీష్ హీరో అల్లు అర్జున్ కారు డ్రైవ‌ర్ పై ఓ క్యాబ్ డ్రైవ‌ర్ చేసిన ఫిర్యాదు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న కారును దౌర్జ‌న్యంగా తీసుకెళ్ల‌ట‌మే కాదు.. డ‌బ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారంటూ ఓ క్యాబ్ డ్రైవ‌ర్ చేసిన ఫిర్యాదు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. జూబ్లీహిల్స్ పోలీసుల‌కు అందిన ఫిర్యాదు ప్ర‌కారం.. క్యాబ్ డ్రైవ‌ర్ రామ‌కృష్ణ శ‌నివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌రు వ‌న్ కు వెళ్లాడు.

అక్క‌డి 'మోకా' ద‌గ్గ‌ర త‌న కారును రివ‌ర్స్ చేయ‌సాగాడు. అదే స‌మ‌యంలో రోడ్డు ప‌క్క‌న ఆపి ఉన్న అల్లు అర్జున్ కారు (ఏపీ09 పీవీ0666) కారును ఢీ కొట్టాడు. కారుకు జ‌రిగిన డ్యామేజ్ కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలంటూ త‌న కారు తాళాల్ని అల్లు అర్జున్ డ్రైవ‌ర్ మ‌హిపాల్ తీసుకెళ్లిన‌ట్లు ఆరోపించారు. రూ.20వేలు అవుతుంద‌ని.. అదే షోరూంకి తీసుకెళితే రూ.2ల‌క్ష‌లు అవుతుంద‌ని త‌న‌ను బెదిరించిన‌ట్లుగా పేర్కొన్నాడు.

అంత డ‌బ్బు తాను ఇవ్వ‌లేన‌ని చెప్పటంతో త‌న కారును బ‌ల‌వంతంగా లాక్కున్నార‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు డ్రైవ‌ర్ల‌ను పిలిపించిన పోలీసులు.. విచారించి వివ‌రాలు సేక‌రించారు. ప్ర‌స్తుతం ఈ ఉదంతంపై పోలీసులు విచారిస్తున్నారు.