Begin typing your search above and press return to search.
మద్యం షాపులను అనుమతించండి ...10 రాష్ట్రాల సీఎంలకు లేఖ !
By: Tupaki Desk | 8 April 2020 11:30 AM ISTకరోనా వైరస్ ... ఈ మహమ్మారి పేరు వింటేనే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయంతో గజగజ వణికిపోతున్నారు. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్, ఆ తరువాత ప్రపంచం మొత్తం వ్యాప్తిచెంది, ప్రపంచాన్ని వణికించేస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 14 లక్షల మందికి పైగా కరోనా భారిన పడగా ..82,085 మంది మరణించారు ఇక దేశంలో కూడా కరోనా కేసులు 5,356 గా నమోదు అయ్యాయి. వరల్డ్ ఓ మీటర్ ప్రకారం.. వీరిలో ఇప్పటివరకు 160 మంది మరణించారు. ఇక ఈ కరోనా వైరస్ కి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో .. కరోనాను అరికట్టడానికి అన్ని లాక్ డౌన్ ను విధించారు. మన దేశంలో కూడా లాక్ డౌన్ ను విధించారు.
ఈ లాక్ డౌన్ వల్ల కొంతమేర కరోనా కేసులు తగ్గాయి అని చెప్పవచ్చు. అయితే , ఈ లాక్ డౌన్ వల్ల ..సామాన్య ప్రజలతో పాటుగా మందుబాబులు కూడా చాల ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మద్యానికి బానిసైన వారు , రకరకాలైన ద్రావణాలు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలను అనుమతించాలని తెలంగాణ సహా పది రాష్ట్రాలకు భారత ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీల సమాఖ్య (సీఐఏబీసీ) విజ్ఞప్తి చేసింది. లాక్‌డౌన్ అమల్లో ఉన్న కారణంగా మద్యం షాపులను మూసివేసినా చాలాచోట్ల మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది.
ఈ మేరకు తెలంగాణ, ఢిల్లీ, హరియాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీబీఏబీసీ లేఖ రాసింది. మద్యంషాపుల మూసివేతతో తాగుడుకు అలవాటు పడినవారి ఆరోగ్యం పై ప్రభావం పడుతోందని, ఇది వచ్చే రోజుల్లో శాంతి భద్రతల పైనా ప్రభావం చూపవచ్చని లేఖలో సీఐఏబీసీ డైర్టెకర్ జనరల్ వినోద్ గిరి తెలిపారు.నిర్ణీత పని వేళలు, కస్టమర్లు సామాజిక దూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని షాపులను తెరిపించవచ్చని ఆయన సూచించారు. అలాగే లాక్ డౌన్ తో షాపులు మూసి వేయించిన దృష్ట్యా మద్యం షాపుల లైసెన్సులను నెల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.