Begin typing your search above and press return to search.

భద్రాచలం పీఠముడి విప్పేశాడు..

By:  Tupaki Desk   |   13 Jun 2019 4:47 PM IST
భద్రాచలం పీఠముడి విప్పేశాడు..
X
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రచలాన్ని త్వరలోనే ఏపీలో విలీనం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే అందులో భద్రాచలం మునిగిపోతుందని.. జగన్ తో స్నేహం దృష్ట్యా భద్రాచలాన్ని కేసీఆర్ ఇచ్చేస్తారనే చర్చ సాగుతోంది. ఇటీవల రాజ్ భవన్ లో ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్ లు భేటి అయినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని సమాచారం.

కాగా ఇదే విషయంపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయననను విలేకరులు ఇదే విషయంపై ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మం జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ కు అప్పగించే అవకాశం లేదని మంత్రి అల్లోల కొట్టిపారేశారు. భద్రచాలాన్ని ఏపీకి ఇస్తున్నారనే మీకు ఎవరు చెప్పారంటూ విలేకరులను తిరిగి ప్రశ్నించారు. అటువంటి ప్రతిపాదన ఏదీ తెలంగాణ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు.

ఇటీవల పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని.. వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకెక్కింది. అయితే దీనిపై చంద్రబాబు భద్రాచలంను తమకు ఇచ్చేయాలని తామే కాపాడుకుంటామని అన్నారు. ఇక జగన్-కేసీఆర్ దోస్తీ తర్వాత భద్రాచలాన్ని కేసీఆర్ ఏపీకి ఇస్తారని ప్రచారం జరిగింది. దీనిపై అల్లోల తాజాగా క్లారిటీ ఇచ్చారు.