Begin typing your search above and press return to search.
ఫైజర్ టీకాతో ఆరోగ్య సిబ్బందికి అలర్జీ .. వ్యాక్సిన్ పై సందేహాలు!
By: Tupaki Desk | 18 Dec 2020 1:01 PM ISTకరోనా మహమ్మారిని అంతం చేయడానికి ఫైజర్ ఫార్మ సంస్థ వ్యాక్సిన్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వ్యాక్సిన్ ను బ్రిటన్, బహ్రెయిన్, అమెరికాలో అత్యవసర వినియోగం కింద పంపిణీ చేస్తున్నారు. అయితే, బ్రిటన్‌లో ఈ టీకా వేయించుకున్న ఇద్దరు నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన సిబ్బంది తీవ్ర అస్వస్థత గురైన విషయం తెలిసిందే. తాజాగా, అమెరికాలోనూ టీకా తీసుకున్న వ్యక్తులకు ఇటువంటి సమస్యలే ఎదురయ్యాయి. కరోనా టీకాను పొందిన ఇద్దరు ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి అలర్జీలు తలెత్తాయి.
ఈ ఘటన అలాస్కా రాష్ట్రంలోని బార్ట్ లెట్ ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగింది. టీకా ఇచ్చిన 10 నిమిషాల్లోనే ఆ లక్షణాలు కనిపించాయి. ఆమె ఒంటిపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు. టీకా తీసుకున్న రెండో ఆరోగ్య కార్యకర్తకు కంటి కింద చర్మం ఉబ్బెత్తు కావడం, కళ్లు తిరగడం, గొంతులో అసౌకర్యం లాంటివి ఎదురయ్యాయి. టీకా షెడ్యూల్, డోసులపై తాజా పరిణామాల ప్రభావం ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు.
ఆక్సిజన్, అలర్జీ ఔషధాలు అందుబాటులో ఉన్న కేంద్రాల్లోనే టీకాలు ఇవ్వాలని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ ఇప్పటికే సిఫార్సు చేసింది. ఇక, గతంలో ఏవైనా ఔషధాలు, ప్రత్యేకమైన ఆహారం కానీ తీసుకున్న సమయంలో అలర్జీ వచ్చినవాళ్లు కరోనా టీకాను తీసుకోవద్దని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏ వ్యక్తయినా గతంలో ఔషధాలు, ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అలర్జీ వంటి దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటే ప్రస్తుతం ఫైజర్ టీకాను తీసుకోవద్దని బ్రిటన్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైనీ అన్నారు.