Begin typing your search above and press return to search.

పరిటాల ఫ్యామిలీపై భూకబ్జా ఆరోపణలు?

By:  Tupaki Desk   |   24 Sept 2020 4:20 PM IST
పరిటాల ఫ్యామిలీపై భూకబ్జా ఆరోపణలు?
X
పరిటాల కుటుంబంపై మరో సీరియస్ ఆరోపణ చేశాడు ఆ జిల్లాకే చెందిన ఓ వ్యాపారి. బాధితుడి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం జిల్లా కురుగుంటకు చెందిన వ్యాపారి మేడా చంద్రశేఖర్ అవసరం నిమిత్తం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళీ వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నట్టు సమాచారం. ఆ సమయంలో మురళీ తన మామ వేలూరు రామాంజనేయులు పేరు మీద ఈ కోటి రూపాయలను వ్యాపారి చంద్రశేఖర్ కు ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాయించుకున్నాడు.

అయితే కోటి రూపాయలపై రూ.2.75కి వడ్డీతో అప్పు చెల్లించాలని మురళీ డిమాండ్ చేశాడట. ఆ తరువాత వ్యాపారి చంద్రశేఖర్ కు చెందిన రూ.10 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని ఇవ్వాలని మురళీ వేధించాడని బాధిత వ్యాపారి ఆరోపిస్తున్నాడు. తాను కోటి రూపాయలు అప్పును తిరిగి చెల్లిస్తానని చెప్పినా వినకుండా మురళీ తన వ్యవసాయ భూమిని బలవంతంగా అప్పు కింద జమచేసుకున్నాడని సదురు వ్యాపారి ఆరోపిస్తున్నాడు.

తనను బెదిరించి తన 10 కోట్ల భూమిని కోటి అప్పు కింద అక్రమంగా రిజిస్ట్రర్ చేయించుకున్నారని బాధితుడు చంద్రశేఖర్ తాజాగా మీడియా ముందు వాపోయాడు.

కాగా పరిటాల ఫ్యామిలీపై వ్యాపారి చేసిన ఆరోపణలు జిల్లాలో కలకలం రేపాయి. అయితే ఈ ఆరోపణలపై అటు పరిటాల సునీత కానీ.. ఆమె సోదరుడు మురళీ కానీ ఇంతవరకు స్పందించలేదు.వీరి వివాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.