Begin typing your search above and press return to search.

బిడ్డ‌కు ప‌దేళ్ల వ‌ర‌కు సంర‌క్ష‌ణ బాధ్య‌త త‌ల్లిదే.. విడాకుల కేసులో అల‌హాబాద్ హైకోర్టు తీర్పు

By:  Tupaki Desk   |   14 May 2022 8:29 AM GMT
బిడ్డ‌కు ప‌దేళ్ల వ‌ర‌కు సంర‌క్ష‌ణ బాధ్య‌త త‌ల్లిదే.. విడాకుల కేసులో అల‌హాబాద్ హైకోర్టు తీర్పు
X
దంప‌తుల మ‌ధ్య త‌లెత్తిన మ‌న‌స్ఫ‌ర్థ‌ల కార‌ణంగా విడాకులు తీసుకున్న త‌ర్వాత‌.. అనుకోని కార‌ణాల‌తో వారి మ‌ధ్య సెటిల్మెంట్ జ‌రిగి.. స‌హ‌జీవ‌నం చేస్తున్నా.. విడాకులు ర‌ద్దుకాద‌ని.. అల‌హాబాద్ హైకోర్టు స్ప ష్టం చేసింది. ఒక‌వేళ విడాకులు ర‌ద్దు చేసుకోవాల‌ని అనుకుంటే.. కోర్టు తీర్పు త‌ప్ప‌నిస‌ర‌ని.. హైకోర్టు తేల్చి చెప్పింది. అదేస‌మ‌యంలో విడాకులు తీసుకున్నాక‌..వారి పిల్ల‌ల‌కు 10ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు వారి సంర‌క్ష‌ణ బాధ్య‌త త‌ల్లిదేన‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఓ కేసుకు సంబంధించి తీర్పు వెలువ‌రించింది.

డాక్ట‌ర్ అభిజిత్ కుమార్‌, శ్వేతా గుప్తా దంప‌తులు. వీరికి ఆర‌వ్ అనే చిన్నారి ఉన్నాడు. అయితే.. ఈ దంప తుల మ‌ధ్య త‌లెత్తిన మ‌నస్ఫ‌ర్థ‌ల కార‌ణంగా.. విడాకులు తీసుకున్నారు. ఈ స‌మ‌యంలో చిన్నారి ఆర‌వ్ ను త‌ల్లి వ‌ద్దే ఉంచాల‌ని..బాలుడికి ప‌దేళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌రకు ఆమె సంర‌క్షించాల‌ని.. ఈ ఖ‌ర్చుల మొత్తాన్ని.. తండ్రి భ‌రించాల‌ని కోర్టు ఆదేశించింది. తండ్రి, తాత వారానికి ఒకసారి మధ్యాహ్నం మూడు గంటల పాటు కలుసుకునేందుకు కోర్టు అంగీక‌రించింది.

త‌ర్వాత‌.. ఏం జ‌రిగింది?

విడాకులు తీసుకున్న త‌ర్వాత‌.. అనూహ్యంగా దంప‌తుల మ‌న‌సు మారింది. క‌లిసి జీవించాల‌ని అనుకు న్నారు. పెద్ద‌ల స‌మ‌క్షంలో చేసుకున్న ఒప్పందం మేర‌కు కొన్ని నెల‌ల‌పాటు స‌హ‌జీవ‌నం చేశారు. ఇంత‌లో శ్వేతా గుప్తాకు ఏమైందో ఏమో.. ఆమె ఓ రోజు ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే.. అప్ప‌టి వ‌ర‌కు శ్వేతాతోనే ఉన్న‌.. ఆర‌వ్‌ను అప్ప‌గించేందుకు భ‌ర్త డాక్ట‌ర్ అభిజిత్ ఒప్పుకోలేదు. దీంతో శ్వేత‌.. గ‌తంలో విడాకుల స‌మ‌యంలో ఇచ్చిన కోర్టు తీర్పును తెర‌మీదికి త‌చ్చింది.

బిడ్డ‌ను త‌ల్లి సంర‌క్ష‌ణ‌లోనే ఉంచ‌మ‌న్న తీర్పును అభిజిత్ ధిక్క‌రిస్తున్నార‌ని.. పేర్కొంది. దీంతో ఈ కేసు అల‌హాబాద్ హైకోర్టుకు చేరింది. ఈ కేసు విచార‌ణ స‌మ‌యంంలో గ‌తంలో విడుకులు తీసుకోవ‌డం.. మ‌ధ్య‌లో స‌హ‌జీవ‌నం చేయ‌డం.. ఇప్పుడు బిడ్డ వివాదం.. అన్నీ ఒకదాని త‌ర్వాత‌.. ఒక‌టి తెర‌మీదికి వ‌చ్చాయి. వాట‌న్నింటినీ ఓపిక‌గా విచారించిన కోర్టు.. విడాకుల తీర్పు ఇచ్చిన త‌ర్వాత‌ భార్యాభర్తల మధ్య న్యాయస్థానం వెలుపల సెటిల్మెంట్ జరిగినా కోర్టు ఆమోదం పొందితే తప్ప తీర్పు రద్దు కాద‌ని స్ప‌ష్టం చేసింది.

అదేవిధంగా పదేళ్ల వరకు బిడ్డ సంరక్షణ బాధ్యత తల్లిదేన‌ని మ‌రోసారి తేల్చి చెప్పింది. ఈ మేర‌కు ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్..10 సంవత్సరాల వయస్సు వరకు పిల్లల సంరక్షణ హక్కును తల్లికి కోర్టు ఇచ్చిందన్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఎవరితో కలిసి జీవించాలను కుంటున్నాడో ఆ చిన్నారి కోరికను కూడా కోర్టు అడిగిందని, అందుకే తల్లితో వెళ్లాలనే కోరికను వ్యక్తం చేశాడని న్యాయ‌మూర్తి తెలిపారు. ఈ పిటిషన్‌పై నెల రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని భర్తను కోర్టు కోరింది. తదుపరి విచారణ జూలైలో జరగనుంది.