Begin typing your search above and press return to search.

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమన్న కోర్టు

By:  Tupaki Desk   |   8 Dec 2016 9:00 AM GMT
ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమన్న కోర్టు
X
గడిచిన కొంత కాలంగా ట్రిపుల్ తలాక్ మీద సాగుతున్న రచ్చ ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చేలా అలహాబాద్ హైకోర్టు ఒక స్పష్టతతో కూడిన కేసుగా అభివర్ణిస్తున్నారు. ఇస్లాం ఆచారం ప్రకారం.. ట్రిపుల్ తలాక్ ను ఆమోదించాలని.. ఇలాంటి మత సంబంధమైన నమ్మకాల విషయాల్లో కోర్టులు.. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవటం సరికాదంటూ మైనార్టీ లా బోర్డు స్పష్టం చేస్తోంది. తమ మత విశ్వాసాల విషయాల్ని ఎందుకు టచ్ చేస్తారంటూ ముస్లిం లా బోర్డు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే అంశం మీద సుప్రీంకోర్టులో కూడా పంచాయితీ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అలహాబాద్ హైకోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులు ఇవ్వటం సరికాదని.. ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించటం అంటే.. ముస్లిం మహిళల హక్కుల్ని హరించటమేనని స్పష్టం చేసింది.

ఓపక్క ముస్లిం మత పెద్దలు.. ట్రిపుల్ తలాక్ పై వస్తున్న విమర్శలు.. అభ్యంతరాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా హైకోర్టు తీర్పు రావటమే కాదు.. విస్పష్టంగా తమ అభిప్రాయాల్ని తేల్చి చెప్పిన నేపథ్యంలో.. రానున్నరోజుల్లో పరిణామాలు ఎలా మారతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.