Begin typing your search above and press return to search.

రహదారులపై 'గోదావరి వరద'

By:  Tupaki Desk   |   18 July 2015 6:28 AM GMT
రహదారులపై గోదావరి వరద
X
తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు భక్తుల తాకిడి పెరగడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి తెలంగాణ జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతానికి దారితీసే మార్గాలు... అదేసమయంలో రాజమండ్రికి వెళ్లే విజయవాడ జాతీయ రహదారి కూడా జామ్ అయింది. కరీంనగర్, నిజామాబాద్ రోడ్లలో ట్రాపిక్ జామ్ ఏర్పడింది.. ఆదిలాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. కిలోమీటర్ల మేరా వాహనాలు నిలచిపోవడంతో పుష్కరాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల పరిధిలోని జాతీయ రహదారిపై రద్దీ నియంత్రణకు అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మేడ్చల్‌ సమీపంలో టోల్‌గేట్‌ వద్ద వేలాది వాహనాలు నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇక్కడ సాధారణంగా రోజుకు వెయ్యి వాహనాలు వెళ్తుంటాయి... అలాంటిది ఒక్కసారిగా ఒక్కసారిగా మూడు వేల వాహనాలు వెళ్తుండడంతో జామవుతోందని టోల్ గేట్ సిబ్బంది చెబుతున్నారు. కరీంనగర్ వెళ్లే రాజివ్ రహదారి పరిస్థితి అదే విధంగా ఉంది. వరుసగా రెండు రోజుల పాటు సెలవు దినాలు రావడంతో హైదరాబాద్‌ నుంచి బాసర, పోచంపాడు, ముథోల్‌, ధర్మపురి, కాళేశ్వరం తదితర ప్రాంతాల పుష్కరఘాట్లకు వేల సంఖ్యలో బయల్దేరుతున్నారు. శని, ఆదివారాలు సెలవు రావడంతో ఉద్యోగులు, ప్రయివేటు రంగాలకు చెందినవార్లు సొంత వాహనాల్లో వెళ్తుండడంతో భారీగా ట్రాఫిక్ జామవుతోంది.

మరోవైపు రెండు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల భక్తులు తరలివస్తుండటంతో గోదావరి పుష్కరాలు మహా కుంభమేళను తలపిస్తున్నాయి. లక్షలాదిగా జనం తండోపతండాలుగా వస్తుండటంతో బస్సులు, రైళ్లన్ని భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారు జాము నుంచే పవిత్ర గోదావరి నీటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల తాకిడికి అనుగుణంగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు గట్టి భద్రతను ఏర్పాటు చేశాయి. ఎప్పటికప్పుడు పుష్కరఘాట్ల వద్ద పరిస్థితులను సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నాయి.

మరోవైపు.. చంద్రబాబు సంచలన టోల్ గేట్లన్నీ ఈరోజు ఫ్రీ వేగా మార్చారు. అయినా కూడా జాతీయ రహదారిలో కిలోమీటర్ల మేర వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఉండటంతో మెల్లగా కదుల్తోంది. అసలు సంక్రాంతి సమయాల్లో కూడా ఇంత రద్దీ ఎపుడూ లేదు. భారీ సంఖ్యలో జనం వస్తున్నారన్న ఆనందంతో పాటు వారి భద్రత విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన టీంకు చమటలు పట్టిస్తున్నారు. ఈరోజు రేపు ఒక్కోరోజు 60 లక్షల మంది రావచ్చని అంచనా వేస్తున్నారు. పుష్కరాల్లో ఇది ప్రధానమైన్ వీకెండ్ కావడం, సోమ మంగళవారాల్లో పిల్లలకు సెలవులు కూడా ఇవ్వడంతో ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ వీకెంట్ భారీగా తరలివస్తున్నారు. మొత్తానికి ఈ రెండు రోజులు క్షేమంగా గడవాలని బాబు గోదావరి మాతను ప్రార్థిస్తూ ఉంటారు.