Begin typing your search above and press return to search.
31 వరకు దేశమంతా బంద్ !
By: Tupaki Desk | 22 March 2020 4:05 PM ISTఇటలీలో మూడో వారం పరిస్థితి ఎలా ఉందో ఇండియాలో కూడా మూడో వారం పరిస్థితి కొంచెం అటు ఇటుగా అలాగే ఉంది. అందుకే తదుపరి వారాల్లో మనం అలాంటి పరిస్థితికి జారుకోకుండా కేంద్ర రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కదులుతున్నాయి. సాయంత్రం నాలుగ్గంటలకు కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి కూడా సాయంత్రం మీడియా ముందుకు రానున్నారు. మరోవైపు కేంద్రం కూడా కరోనా సోకిన 75 జిల్లాలు లాక్ డౌన్ చేయించే దిశగా ఆలోచిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇది విపరీతాలకు దారితీయకుండా లాక్ డౌన్ చేస్తే మంచిదనే ఆలోచనతో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే రాజస్తాన్, ఒడిసా, పంజాబ్ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ ప్రకటిస్తే... ఆస్పత్రి, నిత్యావసరాలు తప్ప మిగతా అన్నీ బంద్ చేస్తారు. కరోనాను అడ్డుకోవడానికి ఇదొక్కటే మార్గమని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం అన్ని మెట్రో రైళ్లను, ప్యాసింజర్ రైళ్లను మే 31 వరకు బంద్ చేసింది. ప్రస్తుతం ముంబై నగరం లాక్ డౌన్ లో ఉంది. దేశంలో అత్యధిక కేసులు అక్కడే నమోదై ఉన్నాయి. ఇంకా పెరుగుతున్నాయి కూడా. అందుకే లాక్ డౌన్ విషయంపై ప్రభుత్వాలు సీరియస్ గా ఉన్నాయి.
ముఖ్యంగా ఇప్పటి వరకు మహారాష్ట్ర తప్ప మిగతా ఎక్కడా రెండో దశ దాటలేదు. మహారాష్ట్రలో మూడోదశలోకి వెళ్లాం. ఇది చాలా ప్రమాదకరమైన దశ. ఈ దశలో ఎవరి వల్ల ఎవరికి సోకిందో అర్థం కాని పరిస్థితి. సాయంత్రం 6 గంటల్లోపు అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.