Begin typing your search above and press return to search.

వారందరు ఇక మాస్కులు వాడాల్సిన అవసరంలేదు : CDC సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   9 March 2021 5:30 AM GMT
వారందరు ఇక మాస్కులు వాడాల్సిన అవసరంలేదు : CDC సంచలన ప్రకటన
X
సీడీసీ అంటే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ. ఇది అమెరికాలో రకరకాల వ్యాధులు, వైరస్‌ లపై అధ్యయనం చేస్తుంది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ సంస్థ. ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్ పూర్తిగా వేసుకున్న వారంతా మాస్క్ లేకుండా ఓ చోట ఉండొచ్చని సీడీసీ తెలిపింది. ఇక్కడ రెండు డౌట్లు ఉన్నాయి. పూర్తిగా వ్యాక్సిన్ వేసుకోవడం అంటే, కొన్ని కంపెనీల వ్యాక్సిన్లు 2 డోసులు వేసుకుంటే , ఫుల్లుగా వేసుకున్నట్లు , అదే కొన్ని కంపెనీలైతే, తమ వ్యాక్సిన్ ఒక్క డోసు వేసుకుంటే చాలు అంటున్నాయి. ఆలా వేసుకున్నా పూర్తిగా వేసుకున్నట్లే. అలా వేసుకున్నవారంతా, ఒక చోటికి చేరినప్పుడు మాస్కులు వాడాల్సిన పని లేదనీ, సేఫ్ డిస్టాన్స్ కూడా పాటించాల్సిన అవసరం లేదని అంటోంది సీడీసీ.

పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్న వారు మరీ ఎక్కువ మంది కాకుండా, కొద్ది మంది గ్రూపుగా ఉండొచ్చని సీడీసీ అంటోంది. ఇక్కడే మరో మెలిక కూడా పెట్టింది. ఫుల్లుగా వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన ఇక ఏ జాగ్రత్తలూ తీసుకోవాల్సిన పనిలేదు అని అనుకోవద్దు అని, ఎప్పట్లాగే మాస్కులు వాడాలనీ, సేఫ్ డిస్టాన్స్ పాటించాలనీ చెప్పింది. తమ చుట్టూ ఉన్న ప్రజల్లో వ్యాక్సిన్ వేయించుకోని వారు ఉండొచ్చు కదా... వారి నుంచి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. వ్యాక్సిన్ వేయించున్నప్పటికీ ,లాంగ్ డిస్టాన్స్ ప్రయాణాలు చేయవద్దని అమెరికాలో ప్రజలను కోరింది. అమెరికాలో మిగతా దేశాల కంటే ఎక్కువగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజూ 50వేల నుంచి లక్ష దాకా వస్తున్నాయి. అయితే, ఆర్థిక పరిస్థితులు దారుణంగా తయారవ్వడంతో నార్మల్ పరిస్థితుల వైపుగా అడుగులు వేయించేందుకు సీడీసీ తన గైడ్ ‌లైన్స్‌ ని కొద్దిగా మార్చింది. ఫలితంగా ఫుల్లుగా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, ఉద్యోగుల వంటివారు మాస్కులు లేకుండానే పనులు చేసుకునేందుకు వీలు కలగనుంది. అమెరికాలో మొత్తం కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య 2.97 కోట్లు దాటింది. కొత్తగా 788 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 5.38 లక్షలు దాటింది. గతేడాది చలికాలంతో పోల్చితే, కొత్త కేసులు, మరణాల సంఖ్య 40 శాతం దాకా తగ్గింది. అందువల్ల సీడీసీ నిబంధనలను సడలించింది.