Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు: ముస్లిం బోర్డు సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   17 Nov 2019 10:29 AM GMT
అయోధ్య తీర్పు: ముస్లిం బోర్డు సంచలన నిర్ణయం
X
ఎన్నో ఏళ్లుగా హిందూ-ముస్లింల మధ్య నలిగిపోతున్న అయోధ్య సమస్యపై ఇటీవలే సుప్రీ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమిని రామాలయ నిర్మాణానికి ట్రస్టుకు అప్పగించాలని ఆదేశించింది. ఇదే సమయంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల ప్రత్మామ్మాయ స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై ముస్లిం సంఘాలకు రివ్యూ చేసే అవకాశాన్ని సుప్రీం కోర్టు కల్పించింది..

తాజాగా అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లాలా వద్దా అనే దానిపై లక్నోలో ‘అల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు’(ఏఐఎంపీఎల్ బీ) ఆదివారం సాయంత్రం సమావేశమైంది.. ఎంఐఎం సహా ముస్లిం పార్టీలు, సంఘాలు, బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ దేశంలోని కీలక ముస్లిం మతపెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏఐఎంపీఎల్ బీ సంచలన నిర్ణయం తీసుకుంది.

అయోధ్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని ఏఐఎంపీఎల్ బీ నిర్ణయించింది. ఇక బాబ్రీ మసీదు కోసం ఇవ్వబోయే ఐదు ఎకరాల భూమిని కూడా ఈ ముస్లిం లా బోర్డు నిరాకరించింది.తమకు ఆ భూమి అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు అయోధ్య తీర్పుపై సుప్రీంలో సవాలు చేయాలని ముస్లిం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.

అయితే ఇప్పటికే అయోధ్యపై ప్రతివాదులుగా ఉన్న కొన్ని ముస్లిం సంఘాలు , దేశంలోని పలువురు ముస్లింలు , ప్రతినిధులు స్వాగతించారు. అయితే ఏఐఎంపీఎల్ బీ మాత్రం రివ్యూ పిటీషన్ కు వెళ్లాలని డిసైడ్ కావడం సంచలనంగా మారింది. మరి సుప్రీం కోర్టు ఈ రివ్యూ పిటీషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి గా మారింది.