Begin typing your search above and press return to search.

అందరికళ్ళు ఆ నియోజకవర్గం పైనే !

By:  Tupaki Desk   |   8 March 2021 7:30 AM GMT
అందరికళ్ళు ఆ నియోజకవర్గం పైనే !
X
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ అసెంబ్లీ నియోజకవర్గమే పశ్చిమబెంగాల్ లోని నందిగ్రామ్. ఎప్పుడైతే మమతాబెనర్జీ భవనానీపూర్ నుండి కాకుండా నందిగ్రామ్ నుండి పోటీ చేయాలని డిసైడ్ చేశారో రాష్ట్రంలో పెద్ద సంచలనమైంది. సుబేందు అదికారిని ఓడించటం లేదా అధికారి కుటుంబం ఆదిపత్యాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా మమత ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారు. దాంతో నందిగ్రామ్ ఫలితం ఎలాగుంటుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.

మమత చాలెంజ్ ను సుబేందు స్వీకరించమే కాకుండా తానే స్వయంగా అక్కడి నుండి పోటీకి రెడీ అవటంతో హై ఓల్టేజీ రాజీకీయాలు మొదలైపోయాయి. రాబోయే ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి మమత, బీజేపీ నుండి సుబేందు పోటీ చేయబోతున్నారు. దాంతో 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 293 నియోజకవర్గాలు ఒకఎత్తు, నందిగ్రామ్ ఒక్కటి ఒక ఎత్తుగా నిలిచింది.

అసలు ఈ నియోజకవర్గంపై అందరిలోను ఎందుకు టెన్షన్ పెరిగిపోతోంది ? ఎందుకంటే నందిగ్రామ్ ప్రాంతంలోని సుమారు 40 నియోజకవర్గాల్లో సుబేందు కుటుంబం చెప్పిందే వేదం. విచిత్రమేమిటంటే సుబేదు అధికారి కుటుంబం ఏ పార్టీలో ఉన్నా ఆధిపత్యం మాత్రం వాళ్ళదే. 40 నియోజకవర్గాల్లో వాళ్ళు ఎవరిని నిలబెడితే గెలుపు వాళ్ళదే. సుబేందును కాదని ప్రత్యర్ధులు గెలవటం చాలా చాలా కష్టమనే చెప్పాలి. మొన్నటివరకు మమతకు కుడిభుజంగా ఉన్న సుబేందు ఒక్కసారిగా ఎదురుతిరిగి బీజేపీలోకి ఫిరాయించారు.

సో సుబేందుకు కంచుకోట లాంటి నందిగ్రామ్ లో మమత పోటీ చేయాలని డిసైడ్ అవటంతోనే సంచలనం మొదలైంది. సుబేందుకు నందిగ్రామ్ పై ఉన్న పట్టు ఏమితో తెలీకుండానే దీదీ అడుగుపెట్టుంటారా ? కచ్చితంగా తెరవెనుక గట్టి కసరత్తు చేసి పటిష్టమైన వ్యూహంతోనే పోటీకి రెడీ అయినట్లు అర్ధమవుతోంది. ఇక్కడ గనుక గెలిస్తే బెంగాల్లో ఎన్నికల్లో మమత చరిత్ర సృష్టించినట్లే. మమతను 50 వేల ఓట్ల తేడాతో ఓడగొడతానని సుబేందు చాలెంజ్ చేయటంతోనే ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే నందిగ్రామ్ లో గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించినట్లే అనుకోవాలి.