Begin typing your search above and press return to search.

శృంగార పాఠాలు..మన సంస్కృతిలో భాగాలు..

By:  Tupaki Desk   |   19 April 2020 11:30 PM GMT
శృంగార పాఠాలు..మన సంస్కృతిలో భాగాలు..
X
దేవాలయాలపై ఆ బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయి. అందరూ బహిరంగంగా ఉండేచోట. అందులోనూ పూజలు జరిగే చోట. ఇలాంటి అశ్లీలమైన బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయన్న ప్రశ్నలు తలెత్తకమానవు. ఐతే.. దీనికీ ఓ సమాధానం ఉంది. ఆ బొమ్మలు భారత సంస్కృతిలో శృంగారం ప్రాముఖ్యతను తెలియజేస్తాయి.

మానవుడి ధర్మ - అర్థ - కామ - మోక్షాల్లో కామానికి చాలా ప్రామఖ్యత ఉంది. కామాన్ని కూడా ఆరోజుల్లో పవిత్రమైన కార్యంగా భావించేవారు. సృష్టి పరమ పవిత్రమైంది కాబట్టే గుళ్లలో ఆ శిల్పాలు ఉంచేవారట. అంతే కాదు.. భక్తిలో పడిపోయిన అసలు సృష్టి మరిచిపోకూడదన్నది కూడా మరో కారణం. అంతే కాదు.. రతిభంగిమల గురించి అప్పట్లో చర్చించే అవకాశం లేనందువల్ల ఆలయాలపై బొమ్మల ద్వారా శృంగార విద్య బోధించేవారు.

పూర్వకాలంలో ఎక్కువగా యువకులు దేవాలయాల్లో నిద్రపోయేవారు. వారిలో లైంగిక ప్రవృత్తిని పెంచడానికి దేవాలయాలపై ఇలాంటి శిల్పాలు చెక్కించే వారనే వాదనే ఉంది. ‘కామి గాక మోక్షగామి కాడు’ అంటే కామి కాని వాడు మోక్షాన్ని పొందలేడు అని.. అందుకే దేవాలయాల్లో నగ్నశిల్పాలు చెక్కించారనే ఓ వాదన ప్రచారంలో ఉంది.

ఇక మరో కోణం కూడా ఉంది. పూర్వం.. స్త్రీ - పరుషుల అవయవాలను పోలిన పిండి వంటను చేసుకొని అందరికీ పంచి మరి తినేవారట.. ఇలా చేయడం వలన స్త్రీ పురుషులకు అంటిపెట్టుకున్న దోషాలు పోతాయట.. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటీ అంటే ఎప్పుడు దైవ కార్యాలయంలో ఉంటూ సృష్టి కార్యాన్ని మరవకూడదు అని పూర్వీకులు చెబుతుంటారు.