Begin typing your search above and press return to search.
బోయింగ్ 737-మాక్స్ విమానాల నిలిపివేత
By: Tupaki Desk | 13 March 2019 10:23 AM ISTఇథియోపియా దేశానికి చెందిన బోయింగ్ 737-మాక్స్ విమానం కూలి 150కు పైగా ప్రయాణికులు, సిబ్బంది మరణించడంతో భారత విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంస్థ అలెర్ట్ అయ్యింది. దేశంలోని విమానయాన సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్న బోయింగ్ 737-మాక్స్ విమానాలన్నింటిని తక్షణమే నిలుపుదల చేయాలని ఆదేశించింది.
బోయింగ్ 737-మాక్స్ విమానాల్లోని రక్షణ చర్యలను పర్యవేక్షించి కొన్ని మార్పులు - చేర్పులు చేయాలని.. ఆ తర్వాత వాటిని ఎగరడానికి అనుమతించాలని డీజీసీఏ ఆదేశించింది. తాము ప్రయాణికుల భద్రత దృష్ట్యా బోయింగ్ విమానాలను నిలుపుదల చేశామని డీజీసీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. తాము ఇప్పటికే ఈ విషయమై బోయింగ్ సంస్థకు తెలియజేశామని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ విమానాల భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తక్షణం స్పందించాలని కోరినట్టు పేర్కొంది.
డీజీసీఏ ఆదేశాల నేపథ్యంలో ప్రైవేటు జెట్స్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా తక్షణం స్పందించింది. తమ దగ్గరున్న బోయింగ్ 12-13 బీ737 మాక్స్ విమానాలను కూడా నిలిపివేసింది. ఇథియోపిన్ విమానం కూలిన నేపథ్యంలో తమ దగ్గరున్న మాక్స్ జెట్ ఎయిర్ వేస్ లను తక్షణం నిలిపివేశామని.. వీటి లీజీను కూడా పునరుద్ధరించుకోమని స్పైస్ జెట్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రపంచంలోని చాలా దేశాలు బోయింగ్ సంస్థ తయారు చేసిన విమానాలనే వాడుతున్నాయి. ఇందులో బీ737 మాక్స్ రకమే వినియోగిస్తున్నారు. సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి.
సింగపూర్ ఎయిర్ లైన్స్ (ఎస్ ఐఏ) సిల్క్ ఎయిర్ రూట్ లో భాగంగా ఈ బీ737మ్యాక్స్ విమానాలను హైదరాబాద్ మరియు బెంగళూరుకు విమానాలను నడిపిస్తోంది. ఇథియోపియన్ విమానం కూలిన నేపథ్యంలో బోయింగ్ 737మాక్స్ విమానాలను తక్షణం నిలిపివేస్తున్నట్టు సింగపూర్ ఎయిర్ లైన్స్ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆస్ట్రేలియా సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అథార్టీ తాత్కాలికంగా బీ737 మాక్స్ జెట్స్ విమానాలను రద్దు చేసింది. చైనా - ఇండోనేషియా విమానయాన సంస్థలు కూడా తాజాగా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ఇథియోపియా - మెక్సికో - కేమాన్ ఎయిర్ వేస్ మరియు సౌత్ ఆఫ్రికా - సౌత్ కొరియా దేశాలు కూడా తాము వాడుతున్న బోయింగ్ బీ737 మాక్స్ విమానాలను నిలిపివేశాయి.
డీజీసీఏ సోమవారం తమ పైలెట్, కోపైలెట్లకు ఆదేశాలు జారీ చేయడంపై తాజాగా విమానయాన రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లయన్, ఇథియోపియన్ విమానాలు కూలినంత మాత్రాన మొత్తం బోయింగ్ సంస్థ విమానాలను రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది తెలివితక్కువ నిర్ణయం అని సీనియర్ పైలెట్లు కూడా అభిప్రాయపడ్డారు.