Begin typing your search above and press return to search.

అందరి కళ్లూ గవర్నరు దిల్లీ టూర్‌ పైనే

By:  Tupaki Desk   |   10 Aug 2019 8:39 AM GMT
అందరి కళ్లూ గవర్నరు దిల్లీ టూర్‌ పైనే
X
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ దిల్లీ పర్యటన పైకి సామాన్యంగా కనిపిస్తున్నా దాని వెనుక కీలక రాజకీయ అంశాలు ఉండొచ్చన్న అంచనాలు ఏపీలోని పాలక పార్టీ వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. ఏపీ గవర్నరుగా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి దిల్లీ వెళ్లడం రాష్ట్రపతిని కలవడం, పార్టీ పెద్దలను కలవడం కోసమేనని చెబుతున్నప్పటికీ దాంతో పాటు భారతీయ జనతా పార్టీ ఏపీ ఆశలు, వ్యూహాలకు సంబంధించిన రాజకీయ దిశానిర్దేశం కూడా ఈ పర్యటనలో ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నరు దిల్లీ పర్యటనపై అందరి దృష్టీ ఉంది.

2029 నాటికి ఏపీలో అధికారం అందుకునే దిశగా బలపడాలని బీజేపీతొలుత కాస్త సుదూర లక్ష్యాన్ని పెట్టుకున్నా ఆ తరువాత ఆ లక్ష్యాన్ని కాస్త ముందుకు జరిపినట్లు చెబుతున్నారు. తెలంగాణతో పాటే ఏపీలోనూ 2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోందట. ఆ క్రమంలో ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి బలపడే ప్రయత్నాలు ప్రారంభించింది. పార్టీ యాక్షన్ టీంలో ఒకరైన సునీల్ దేవధర్ నేతృత్వంలో బీజేపీ ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పుడు గవర్నరుగా సీనియర్ బీజేపీ నేతను నియమించడంతో ఆయన వైపు నుంచి కూడా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టేలా అధిష్ఠానం సూచనలు చేసే అవకాశముందని భావిస్తున్నారు.

గవర్నరు పదవి రాజ్యాంగపరమైనది అయినప్పటికీ అంతర్లీనంగా ఆ పదవి నుంచి రాజకీయ పార్టీలు సహకారం పొందిన సందర్భాలు దేశంలో అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏపీలో ముందుముందు సమస్యలపై బీజేపీ నేతలు ఉద్యమించనున్నారు. వారు గవర్నరు దృష్టికి అలాంటివన్నీ తీసుకురావడం ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం జరగొచ్చని అంచనా వేస్తున్నారు. పక్కా వ్యూహాలకు మారుపేరైన బీజేపీ ఏపీలో ఎప్పుడు ఏం చేయాలనేది సిద్ధం చేసి దాని ప్రకారం ముందుకెళ్లబోతోంది. వీటన్నిటిపైనా దిల్లీలో గవర్నరుతో పార్టీ పెద్దలు చర్చించినట్లు సమాచారం. అధిష్టానం స్క్రీన్ ప్లే ప్రకారం ఇక గవర్నరు నడుచుకుంటారని.. వైసీపీకి ప్రెజర్ మొదలవడం ఖాయమనితెలుస్తోంది.