Begin typing your search above and press return to search.

గ్రహాంతరవాసుల బరువుకూడా చెప్పేస్తున్నారు!

By:  Tupaki Desk   |   9 April 2015 10:30 PM GMT
గ్రహాంతరవాసుల బరువుకూడా చెప్పేస్తున్నారు!
X
గ్రహాంతరవాసులు ఉన్నారా? లేరా? అనే విషయం కాసేపు పక్కన పెడితే... ఉన్నారని సినిమాలు తీసేవాళ్లు, లేరని చర్చలు పెట్టేవారు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా స్పెయిన్ కాస్మాలజిస్టు లు మాత్రం గ్రహాంతరవాసులు ఉన్నారని... వారి ఎత్తు, బరువులు కూడా లెక్కకట్టి చెప్పేస్తున్నారు. అసలు గ్రహాంతర జీవులు ఉంటే వాళ్లు మనలాగా మామూలు మనుషుల్లా ఉంటారా లేక హాలీవుడ్‌ సినిమా దర్శకులు ఊహించి చూపినట్టు ఉంటారా? అదీగాక మరికొందరు చెబుతున్నట్టు వేరే గ్రహాలపై ఉండే సూక్ష్మజీవులను కూడా గ్రహాంతరజీవులుగానే భావించాలా? ఈ ప్రశ్నలకు సమాధానాల్లేవు కానీ.. వారి గురించి రోజుకో రకమైన వార్తలు అయితే వినిపిస్తున్నాయి!
తాజాగా గ్రహాంతరజీవులు ఉన్నాయని, వారి బరువు మానవులకన్నా చాలా ఎక్కువ అని... అది సుమారు 300 కిలోలకు పైగా ఉంటుందని స్పెయిన్‌ కాస్మాలజిస్టు ఫెర్గస్‌ సింప్సన్‌ అభిప్రాయపడుతున్నారు. భూమి, ఇతర గ్రహాల పరిమాణం, వాతావరణం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇలా విశ్లేషించారట! మరో 20-25 సంవత్సరాల్లో దీనిపై ఒక క్లారిటీకి కూడా వచ్చేస్తామని చెబుతున్నారు. ఈ లెక్కన గ్రహాంతర జీవులకు సంబందించి మరో కొత్త హాలీవుడ్ సినిమా రాబొతుందన్న మాట!