Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో ‘అలీ బాబు’..23 దొంగల కథ

By:  Tupaki Desk   |   17 Jun 2019 7:30 AM GMT
అసెంబ్లీలో ‘అలీ బాబు’..23 దొంగల కథ
X
ఏపీ అసెంబ్లీ యమ జోరుగా సాగుతోంది. అధికార వైసీపీ దూకుడుకు టీడీపీ బెంబేలెత్తుతోంది. టీడీపీ తరుఫున చంద్రబాబు, అచ్చెన్నాయుడులకు కౌంటర్లకు వైసీపీ ఎన్ కౌంటర్లు చేస్తోంది. మొదటి సమావేశంలో ఈ తీరుగా సభ సాగితే ఇక మున్ముందు మరింత పసందు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

ఏపీ అసెంబ్లీ సాక్షిగా మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రతిపక్ష అచ్చెన్నాయుడి విమర్శలకు తాజాగా అధికార పార్టీ వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ గా స్పందించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ‘అలీ-బాబు, 23 దొంగల కథ’ను చెప్పి ప్రతిపక్షానికి గట్టి కౌంటర్ ఇచ్చాడు..

ఇప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చిందని టీడీపీ నేతలు జీర్ణించుకోవడం లేదని.. వారికింకా అధికారమత్తు వీడలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. ప్రజలు వాళ్లని.. వాళ్ల విధానాలను తిరస్కరించి ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినా వాళ్లు వాస్తవాన్ని గ్రహించడం లేదని విమర్శించారు. ఐదేళ్లలో ప్రజలు ఏమీ చేయలేని వాళ్లు దోచుకుతిన్నారని దుయ్యబట్టారు. ‘నీరు-చెట్టు’ పేరుతో టీడీపీ నేతలు 18వేల కోట్లు దిగమింగారని.. పోలవరం పేరు చెప్పి దాదాపు 16 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని 56వేలకు పెంచారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.

టీడీపీ ప్రభుత్వ సొమ్మును వినియోగించి తెలుగుదేశం పార్టీ కోసం ఖర్చు చేసిందని సంచలన ఆరోపణలు చేశాడు అనిల్ కుమార్ యాదవ్. ఢిల్లీలో ‘ధర్మ పోరాట దీక్ష పేరుతో ప్రత్యేక హోదా కోసం ఎన్నికల ముందర బాబు 500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని మండిపడ్డారు. అందుకే ప్రజలు బుద్దిచెప్పి ప్రతిపక్షంలో కూర్చుండబెట్టారని.. అయినా టీడీపీకి బుద్దిరాలేదని ఆయన విమర్శించారు.