Begin typing your search above and press return to search.

పేరుకు లక్ష కోట్లకి వారసుడు ... జీవితం ఎలా కొనసాగిస్తున్నాడంటే ?

By:  Tupaki Desk   |   1 Feb 2020 11:18 AM IST
పేరుకు లక్ష కోట్లకి వారసుడు ... జీవితం ఎలా కొనసాగిస్తున్నాడంటే ?
X
ఈ ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది కోటీశ్వరులు ఉన్నారు. వారి జీవితానికి , సాధారణ వ్యక్తుల జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. అలాగే వారి వారసులు గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది కావాలన్నా కూడా క్షణాల వ్యవధిలో వారి ముందు ప్రత్యక్షం అవుతాయి. వారి తండ్రులు సంపాదించే ఆస్తితో ఏంటో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. అయితే , ఏ తల్లిదండ్రులు అయిన కూడా వారి వారసుల కోసమే సంపాదిస్తారు. కానీ, అందరు బిలియనీర్లు అలా ఉండరు. కొందరు వాళ్ల కొడుకులు కింది నుంచి పైకి రావాలని కోరుకుంటారు. కష్టమంటె ఏమిటో , ఏదైనా అనుకోని సమస్య ఎదురైనప్పుడు ఎలా నడుచుకోవాలో , ఆ సమస్య నుండి ఎలా బయట పడాలో , ఆఫీసుల్లో ఎలా పని చేయాలో , ఉద్యోగులతో ఎలా పని చేయించుకోవాలో సొంతంగా తెలుసుకోవాలని కొన్ని పరీక్షలు పెడుతుంటారు.

ఇలాంటి పరీక్షే రష్యాకు చెందిన 19 ఏళ్ల అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు స్టోరీ. ఈయన తండ్రి మైకేల్‌‌ ఫ్రీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రష్యాలో బిలియనీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వీరికి సుమారు లక్ష కోట్ల ఆస్తి ఉంది. రష్యాలోని కోటీశ్వరుల లిస్ట్ లో ఈయన 11వ స్థానం లో ఉన్నాడు . కానీ కొడుకును మాత్రం సొంతంగా బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకొని , సొంతగా పైకి ఎదగాలని చెప్పాడు. దానికి అతని కొడుకు కూడా సరే అని చెప్పాడు. ఇందులో భాగంగానే బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిగ్రీ చదివొచ్చాక 5 నెలల కిందట మాస్కో శివారు లో ఓ రెండు రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను రూ.35 వేలకు రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు తీసుకున్నాడు.

ఐదుగురు ఉద్యోగులతో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిబ్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. తర్వాత రెండో కంపెనీని మొదలుపెట్టాడు. వచ్చే నెలలో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోనూ అడుగుపెట్టబోతున్నాడు. ప్రతి పనిలో తనకు పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండే వాళ్లని తండ్రి చెబుతుండేవారని, సంపాదించాలంటే షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని అంటుండేవారని అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పాడు. ఆస్తినంతా చారిటీకి ఇచ్చేస్తానని తండ్రి చెప్పాడని, కాబట్టి తనకు తండ్రి నుంచి ఎలాంటి ఆస్తి రాదని చెప్పాడు. తన తండ్రికి చెందిన రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులతో పాటు వేరే షాపులకూ తాము డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని చెప్పాడు.సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని స్టెర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు వెళ్లాలనుకున్నానని, కానీ ఓ యేడాది గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని డిసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యా అని తెలిపాడు.