Begin typing your search above and press return to search.

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. అది ఫేక్ న్యూస్.. సర్కార్ ప్రకటన

By:  Tupaki Desk   |   27 Feb 2021 4:34 PM IST
ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. అది ఫేక్ న్యూస్.. సర్కార్ ప్రకటన
X
కరోనా కల్లోలంతో ఏడాదిగా మూతపడిన పాఠశాలలు ఈ మధ్యే తెరుచుకున్నాయి. ఇప్పుడిప్పుడే విద్యార్థులు స్కూళ్లకు వెళుతున్నారు. అయితే తాజాగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

ఈ క్రమంలోనే ఓ వార్త వైరల్ గా మారింది. ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారంటూ ఏపీ ప్రభుత్వ జీవో పేరిట ఓ ఫొటో రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో విద్యార్థులు నమ్మి స్కూళ్లకు సెలవులు అనుకుంటున్నారు. 'రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున స్కూళ్లు, కాలేజీలకు మార్చి 1 నుంచి మే 4 వరకు ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని.. అందరూ దీన్ని పాటించాలని' ఆ న్యూస్ సారాంశం.

దీనిపై తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం అవాస్తమని.. అది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు.

కరోనా వైరస్ సాకు చూపి మార్చి 1వ తేది నుంచి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని.. అది పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. దాన్ని ఎవరూ వైరల్ చేయవద్దన్నారు. సైబర్ క్రైమ్ కు దీనిపై ఫిర్యాదు చేశామని.. అధికారులకు తెలియజేశామని ఆయన తెలిపారు.