Begin typing your search above and press return to search.

మద్యానికి బానిసైన కిమ్.. ఎవరినీ పట్టించుకోవడం లేదా?

By:  Tupaki Desk   |   18 Jan 2023 8:30 AM GMT
మద్యానికి బానిసైన కిమ్.. ఎవరినీ పట్టించుకోవడం లేదా?
X
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ నియంత పాలనపై ప్రపంచవ్యాప్తంగా నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఉత్తర కొరియాలోని ప్రజలు ఎలాంటి హెయిర్ స్టెయిల్ చేయించుకోవాలి.. ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి? అనేది కూడా ఆయనే నిర్ణయిస్తారనే ప్రచారం ఉంది. మరోవైపు సౌత్ కొరియా.. అమెరికాలకు పక్కలో బల్లెంలా కిమ్ జొంగ్ ఉన్ మారిపోయిన సంగతి తెల్సిందే.

ప్రపంచ దేశాలను గడగడలాడించే అమెరికాను సైతం బేఖాతరు చేయని నైజం కిమ్ జొంగ్ ఉన్ ది. నిత్యం క్షిపణి ప్రయోగాలు.. అణ్వస్త్ర ప్రయోగాలతో కిమ్ జొంగ్ ఉన్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటాడు. ఎవరెన్ని చెప్పినా కిమ్ జొంగ్ ఉన్ తాను అనుకున్నదే చేస్తాడనే పేరు ఉంది. దీనినే అమెరికా.. దక్షిణ కొరియాలు బూచీగా చూపిస్తూ కిమ్ జొంగ్ ఉన్ ను ప్రపంచానికి విలన్ గా చూపిస్తుంటాయి.

కాగా కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత విషయాలు బయటకు రావడం చాలా అరుదుగానే జరుగుతూనే ఉంటుంది. వచ్చినా వీటిలో అనేకం కూడా పుకార్లే ఉండటం గమనార్హం. తాజాగా కిమ్ జొంగ్ ఉన్ ఆరోగ్యంపై ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కిమ్ జొంగ్ ఉన్ మద్యానికి బానిసయ్యారని.. ఒంటరితనంతో బాధపడుతూ ఏడుస్తున్నారని మిర్రర్ పత్రిక కథనాలు ప్రచురించడం చర్చనీయాంశం మారింది.

ఆ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కిమ్ జొంగ్ ఉన్ మద్యానికి అతిగా తాగడం.. అనారోగ్య అలవాట్ల కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. ఇటీవల 39వ పుట్టిన రోజు జరుపుకున్న ఆయనకు వయస్సు మీద పడుతుందనే బెంగ ఎక్కువైంది.

తన అనారోగ్యం గురించి బయటి ప్రపంచానికి ఎక్కడ తెలుస్తుందననే ఒత్తిడితో అతిగా మద్యం సేవిస్తూ ఏడుస్తూ కాలం గడుపుతున్నాడని ఉత్తర కొరియా విద్యావేత్త చొయ్ జిన్ వూక్ చెప్పినట్లు మిర్రర్ పత్రిక తన కథనంలో పేర్కొంది.

ఈ కారణంగానే కిమ్ జొంగ్ ఉన్ బయటి పర్యటనలకు వెళ్లినపుడు సొంత టాయిలెట్ కూడా తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. తాగుడు తగ్గించి రోజు వ్యాయామం చేయాలని తన భార్య.. వైద్యులు చెబుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని పేర్కొంది.

ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ గత కొన్ని రోజులు కిమ్ జొంగ్ ఉన్ బయటికి రాకపోవడంతో ఈ వార్తలకు కొంత బలం చేకూరుతున్నట్లే కన్పిస్తోంది. మరీ వార్తలకు చెక్ పెట్టేలా కిమ్ జొంగ్ మరోసారి ఉత్తర కొరియాలో సందడి చేస్తారా? లేదంటే అజ్ఞాతంలో ఉంటారా అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.