Begin typing your search above and press return to search.

ఏపీలో మద్యం స్మగ్లింగ్ .. క్రియేటీవ్ డైరెక్టర్స్ కే షాకులిస్తున్న స్మగ్లింగ్ రాయుళ్లు !

By:  Tupaki Desk   |   3 Sept 2020 7:00 AM IST
ఏపీలో మద్యం స్మగ్లింగ్ .. క్రియేటీవ్ డైరెక్టర్స్ కే షాకులిస్తున్న స్మగ్లింగ్ రాయుళ్లు  !
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విడతల వారీ మద్య నిషేధానికి నడుం బిగించింది. అందులో భాగంగానే మద్యం దుకాణాల తగ్గింపు, మద్యం ధరల పెంపు వంటి నిర్ణయాలను తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీలో మద్యానికి భారీ డిమాండు పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు అక్రమార్కులు అడ్డదారులను తొక్కుతున్నారు. ఈ క్రమంలో మద్యం అక్రమ రవాణా జోరుగా పెరిగింది. అసలు మద్యాన్ని కూడా బంగారం లెవెల్ లో స్మగ్లింగ్ చేస్తున్నారు.

ఓ స్మగ్లర్, తన ఒంటి నిండా మద్యం బాటిళ్లు పెట్టుకుని..స్టిక్కర్ అంటించుకొని బోర్డర్ దాటేస్తున్నారు . బెల్టు బాంబుల్లాగా అంటిచేసుకుని దర్జాగా..సరిహద్దులు దాటి వచ్చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఓ వ్యక్తి బైక్‌ పై సిలిండర్ పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూంటే పోలీసులకు డౌట్ వచ్చింది. ఒకటి రెండు సార్లు ఆపి వివరాలు కనుక్కుంటే, గ్యాస్ బండ తీసుకెళ్తున్నానని చెప్పుకొచ్చాడు. అదే పనిగా అటూ ఇటూ తిరుగుతూండటంతో ఓసారి డౌట్ వచ్చి చెక్ చేశారు. గ్యాస్ బండ తీసుకెళ్తున్నది నిజమే కానీ, అందులో గ్యాస్ లేదు మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఇలా ఒంటికి అంటించుకోవడం సిలిండర్లలో పెట్టుకుని పోవడమే కాదు. ఇంకా చాలా చాలా ఐడియాలు స్మగ్లర్ల వద్ద ఉన్నాయి. కర్ణాటక,తమిళనాడు వైపు నుంచి నిఘా తక్కువగా ఉండటంతో… పెద్దఎత్తున మద్యం సరఫరా జరుగుతోంది. గ్రామాల్లో నుంచి ఆయా రాష్ట్రాలకు దారులు ఉండటంతో స్మగ్లింగ్ అరికట్టడం పెద్ద సవాల్ గా మారింది.

తెలంగాణతో సరిహద్దున ఉన్న జిల్లాల్లో మద్యం స్మగ్లింగ్ భారీగా జరుగుతుంది. పోలీసులు ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటున్న వాహనాలు వేల సంఖ్యలోనే ఉంటాయి. ఇక పట్టుబడకుండా వెళ్లిపోతున్నవి ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే , అసలు రాష్ట్రంలో అమ్ముడైయ్యే మద్యం కంటే స్మగ్లింగ్ అయ్యే మద్యమే ఎక్కువగా ఉందన్న చర్చ నడుస్తుంది. ఏపీలో చాలామంది స్మగ్లర్లకు.. ఇప్పుడు ఇప్పుడు ఇదే ఆదాయవనరు. ఎందుకంటే..ఏపీలో మద్యం రేట్లు చాలా ఎక్కువ మాత్రమే కాదు.. కావాల్సిన బ్రాండ్లు దొరకడం లేదు. మందుబాబులు బ్రాండ్లకు ప్రాధాన్యం ఇస్తారు. దీనితో బడా బ్రాండ్ బాటిల్ ఒక్కటి తెస్తే .. ఇక్కడ అధిక ధరకి అమ్ముకోవచ్చు. దీంతో ఎక్కువ మంది ఈ స్మగ్లింగ్ కు ప్రయత్నిస్తున్నారు. ఇక పలుకుబడి ఉన్న.. అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈ స్మగ్లింగ్ వెనుక ఉంటున్నారు. కర్నూలు జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఓ జడ్పీటీసీ ఇంట్లోనే పెద్ద మొత్తం సరుకు దొరికింది. మద్యం స్మగ్లింగ్ చేస్తూ దొరికే వారు కొందరైతే దొరకని వారు చాలామంది చూడాలి మరి మద్యం స్మగ్లింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉక్కుపాదం మోపుతుందో.