Begin typing your search above and press return to search.

మద్యం డోర్ డెలివరీ - ప్రత్యేక యాప్..ప్రభుత్వం సంచలన నిర్ణయం!

By:  Tupaki Desk   |   5 May 2020 4:00 PM IST
మద్యం డోర్ డెలివరీ  - ప్రత్యేక యాప్..ప్రభుత్వం సంచలన నిర్ణయం!
X
లాక్ ‌డౌన్‌ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరటనిచ్చేలా కేంద్రం మద్యం దుకాణాలకు లాక్ డౌన్ నుండి సడలింపులు ఇవ్వడంతో సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో మద్యం ప్రియులు తెల్లవారుజామున నుంచే షాపుల ముందు బారులు తీరారు. లాక్‌ డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఏమాత్రం సామాజిక దూరం పాటించకుండా మందుకోసం ఎగబడుతున్నారు. లిక్కర్ కోసం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న పరిస్థితుల నేపధ్యంలో ఛత్తీస్ గడ్ ఆన్ లైన్ విక్రయాలపై దృష్టి పెట్టింది .

ఈ క్రమంలోనే మద్యం ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మద్యాన్ని డోర్‌ డెలివరీ చేయలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ - వెబ్‌ సైట్‌ ను సైతం రూపొందించింది. ఛత్తీస్‌ గఢ్‌ స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్యర్యంలో లిక్కర్‌ విక్రయాల కోసం ప్రభుత్వం ఈ వెబ్‌ సైట్ ‌ను మందుబాబులకు అందుబాటులో ఉంచింది. లిక్కర్‌ కావాల్సిన వాళ్లు తొలుత యాప్‌ లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఫోన్‌ నెంబర్‌ - ఆధార్‌ సంఖ్యతో పాటు వినియోగదారుడి పూర్తి వివరాలను యాప్‌ లో పొందుపరచాలి.

అనంతరం ఫోన్‌ ను వచ్చిన పాస్ ‌వార్డుతో యాప్‌ లోకి లాగిన్‌ అ‍య్యి సమీపంలో వైన్‌ షాపులలో నచ్చిన మందును కొనుగోలు చేసుకోవచ్చు. కస్టమర్ ఒకేసారి 5000 మిల్లీ లీటర్ల మద్యం కోసం ఆన్ ‌లైన్ ఆర్డర్‌ ను ఇవ్వవచ్చు, డెలివరీ ఛార్జీలు రూ . 120 గా నిర్ణయించారు. ఆన్ లైన్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ యాప్‌ అందుబాటులో ఉంటుందని అని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. కాగా రాష్ట్రం వ్యాప్తంగా గల గ్రీన్‌ జోన్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది.