Begin typing your search above and press return to search.
ఐపీఎల్ పై రేపు తుది నిర్ణయం.. ఉంటుందా? ఉండదా?
By: Tupaki Desk | 24 March 2020 6:00 AM ISTకరోనా కల్లోలం భారత దేశంలో కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూతో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. కేంద్రం, తెలంగాణ, ఏపీలు లాక్ డౌన్ ప్రకటించడంతో బయట అంతా నిర్మానుష్య వాతావరణం నెలకొంది. వివిధ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు రద్దు అయ్యాయి. విద్యా సంస్థలు మూతపడ్డాయి. ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ వ్యాధితో ఇప్పుడు ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ జరుగుతుందా లేదా అన్న సందేహాలు ఎక్కువయ్యాయి.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్-13 ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 29న జరగాల్సి ఉంది. అయితే భారత్ లో కరోనా కేసులు బయటపడడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఐపీఎల్ ను ఏప్రిల్ 15వరకు వాయిదా వేశారు.
అయితే భారత దేశంలో కరోనా ఇప్పుడిప్పుడే వ్యాపిస్తుండడం.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పాకడంతో ఐపీఎల్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. దేశంలో ఐపీఎల్ కు పిచ్చ క్రేజ్ ఉంది. అత్యధికమంది ప్రజలు స్టేడియాలకు వస్తుంటారు. కరోనా దీనివల్ల మరింత వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ పై తుదినిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ, ప్రాంఛైజీలు మంగళవారం కాన్ఫరెన్స్ కాల్ ద్వారా సమావేశం కానున్నాయి.
ఈ కాన్ఫరెన్స్ కాల్ లో ఐపీఎల్ ను మరికొంత కాలం వాయిదా వేయాలా లేక ఈ ఏడాదికి పూర్తిగా రద్దు చేయాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటాయి.
బీసీసీఐ మొదట ప్రేక్షకులు లేకుండా ఈసారి ఐపీఎల్ నిర్వహిస్తామని మార్చి 13న ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా ప్రబలుతుండడం చూసి నో చెప్పింది. దీంతో ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్ ను వాయిదా వేశారు.
ప్రస్తుతం సమావేశంలో ఐపీఎల్ ను కుదించడమా? లేక జూలై-సెప్టెంబర్ మధ్య నిర్వహించే అంశంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఇక ఇదే ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో సెప్టెంబర్ లోపే ఐపీఎల్ ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ రద్దు అయితే బీసీసీఐకి ఏకంగా 3500 కోట్లు నష్టం వాటిల్లే అవకాశముంది.