Begin typing your search above and press return to search.

ఆ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీలో విబేధాలు?

By:  Tupaki Desk   |   23 July 2019 8:35 AM GMT
ఆ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీలో విబేధాలు?
X
దక్షిణాదిన ఉన్న కుటుంబ పార్టీల్లో డీఎంకే ఒకటి. ఇది ఏర్పడింది ఒక ప్రజావేదికగా - ఉద్యమ పార్టీగానే అయినా.. ఇది ఆ తర్వాత కుటుంబ పార్టీగా మారింది. కరుణానిధి ఆ పార్టీని అలా మార్చారు. తన కొడుకులు ఇద్దర్ని - ఒక కూతురిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు కరుణానిధి. వాళ్లేమో పార్టీని ప్రాంతాల వారీగా పంచుకున్నారు. వారిలో వారు కలహించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పార్టీపై ఆధిపత్యం కోసం కరుణానిధి తనయులు స్టాలిన్ - అళగిరి గట్టిగానే పోరాడారు. ఆ విషయంలో స్టాలిన్ కు మద్దతుగా నిలిచాడు కరుణ. ఆఖరికి పార్టీ పగ్గాలు స్టాలిన్ కే దక్కాయి.

ఇక తను ఇంకా ముఖ్యమంత్రి కూడా కాలేదు కానీ తన తనయుడిని రాజకీయ వారసుడిగా ఎలివేట్ చేయడానికి స్టాలిన్ కష్టపడుతూ ఉన్నాడు. అందులో భాగంగా అతడిని యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించాడు. సినిమాల్లో కూడా కొన్ని ప్రయత్నాలు చేసిన ఉదయనిధి ఇప్పుడు డీఎంకే యూత్ వింగ్ అధ్యక్షుడిగా అపారమైన ప్రాధాన్యతను పొందుతున్నాడట.

పార్టీలో స్టాలిన్ చెబితే ఎంతో.. ఉదయనిధి చెప్పినా అంతే.. అనే టాక్ నడుస్తూ ఉంది. ఈ పరిణామాలను డీఎంకే జీర్ణియించుకుంటోందట కానీ.. ఎంకే స్టాలిన్ సోదరి కనిమొళికి మాత్రం అంత నచ్చడం లేదట. పార్టీలో స్టాలిన్ తర్వాత అంతే తానే కావాలనేది ఆమె ఆలోచన అని సమాచారం. ఉదయనిధికి గొప్ప ప్రాధాన్యత దక్కడం కనిమొళికి ఇష్టం లేదనే ప్రచారం జరుగుతూ ఉంది. ఈ విషయంలో ఆమె అసహనంతో ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ బాధ్యతలు తన తర్వాత తనయుడికే అని స్టాలిన్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.

అయితే కనిమొళిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఆయనకు ఇష్టం లేదట. అందుకే రాజీ ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. ఇప్పటికే పార్టీలో స్టాలిన్ పొడ గిట్టక అళగిరి పూర్తిగా దూరం అయ్యారు.