Begin typing your search above and press return to search.

అమెరికా డ్రోన్‌ దాడిలో అల్‌ఖైదా అగ్రనేత హతం !

By:  Tupaki Desk   |   23 Oct 2021 10:30 AM GMT
అమెరికా డ్రోన్‌ దాడిలో అల్‌ఖైదా అగ్రనేత హతం !
X
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా సీనియర్‌ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి. అమెరికా మిలటరీ సిరియాలో జరిపిన డ్రోన్‌ దాడుల్లో అల్‌ఖైదాకు చెందిన సీనియర్‌ లీడర్‌ అబ్దుల్‌ హామీద్‌ అల్‌ మాతర్‌ మృతి చెందినట్టు అమెరికా మిలటరీసెంట్రల్ కమాండ్ కు చెందిన యూఎస్‌ ఆర్మీ మేజర్‌ జాన్‌ రిగ్స్‌బీ తెలిపారు. సిరియాలో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడుల్లో అల్‌ఖైదా సీనియర్‌ నాయకుడు అబ్దుల్‌ హమీద్‌ అల్ మతార్‌ హతమయ్యాడని యూఎస్‌ ఆర్మీ మేజర్‌ జాన్ రిగ్స్‌బీ తెలిపారు.

దీంతో అమెరికా పౌరులు, తమ భాగస్వామ్య దేశాలు, అమాయక పౌరులపై ఉగ్రవాద సంస్థ జరిపే దాడులు కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించారు. దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడిచేసిన రెండు రోజుల తర్వాత ఈ డ్రోన్‌ దాడి జరగడం విశేషం. అయితే ప్రతికారంగేనీ ఈ జరిగిందా అనే విషయాన్ని అమెరికా ధృవీకరించలేదు. రెండు రోజుల కిందట దక్షిణ సిరియాలోని అమెరికా మిలటరీ ఔట్‌పోస్ట్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా ఈ డ్రోన్‌ దాడులు నిర్వహించారా లేదా అమెరికా డ్రోన్‌లపై దాడి చేసినందుకు ఈ దాడులు చేశారా అనేది జాన్‌ రిగ్స్‌బీ చెప్పలేదు.