Begin typing your search above and press return to search.

అల్ ​ఖైదా అగ్రనేత అల్​​-మస్రీ హతం.. లాడెన్​ కోడలు కూడా.. పక్కా స్కెచ్ ​తో మట్టుబెట్టిన ఇరాన్​ సైన్యం

By:  Tupaki Desk   |   15 Nov 2020 10:30 AM IST
అల్ ​ఖైదా అగ్రనేత అల్​​-మస్రీ హతం.. లాడెన్​ కోడలు కూడా.. పక్కా స్కెచ్ ​తో మట్టుబెట్టిన ఇరాన్​ సైన్యం
X
ఆల్​ఖైదా ఉగ్రవాద సంస్థలో కీలకనేతగా ఉన్న అల్​​-మస్రీ హతమయ్యాడు. ఇరాన్​ బలగాలు పక్కా వ్యూహంతో మస్రీని మట్టుబెట్టినట్టు సమాచారం. అయితే మూడు నెలల కిందటే ఈ ఆపరేషన్​ జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్​మస్రీ.. ఆల్​ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్​ లాడెన్​కు వియ్యంకుడు .. ప్రస్తుతం అల్​ఖైదాలో నంబర్​ 2 నేతగా కొనసాగుతున్నాడు. ఆఫ్రికాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై జరిగిన దాడులకు మస్రీ కీలకసూత్రాదారి.

ఆగస్టు 7న టెహ్రాన్ వీధుల్లో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న అల్-మస్రీని ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయని న్యూయార్క్​ టైమ్స్​తో కథనం వెలువడింది. ఈ కథనాన్ని అమెరికా నిఘావర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఇదే దాడిలో మస్రీ కుమార్తె, అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కోడలు మిరియమ్‌ కూడా హతమైంది. లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్‌‌ను అమెరికా సైన్యం గతంలోనే మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అమెరికా రాయబార కార్యాలయాలపై దాడి జరిగిన తేదీనే మస్రీని మట్టుబెట్టడం విశేషం.

అమెరికా ఆదేశాలతో ఇజ్రాయెల్ దళాలు ఈ ఆపరేషన్‌ చేపట్టినట్టు నలుగురు అధికారులు అయితే, ఇందులో అమెరికా సైన్యం పాల్గొందా? లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఇరాన్‌లో అల్‌ఖైదా ఉగ్రవాదుల కార్యకలాపాలు, అల్-మస్రీ కదలికలపై చాలా సంవత్సరాలుగా పర్యవేక్షణ కొనసాగుతోంది. అల్-మస్రీ చనిపోయినట్టు వదంతలు వచ్చినా.. ఇప్పటి వరకూ ఎవరూ ధ్రువీకరించలేదు. అయితే ఈ దాడిలో అమెరికా బలగాలు కూడా పాల్గొన్నట్టు టాక్​. కానీ అల్​​- మస్రీ చనిపోయినట్టు అటు ఇరాన్​కానీ, ఇటు అమెరికా కాని అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ విషయంపై అల్​ఖైదా కూడా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.