Begin typing your search above and press return to search.

హీరో ట్వీట్ వినతికి సుష్మా స్పందించారు

By:  Tupaki Desk   |   13 July 2016 11:07 AM IST
హీరో ట్వీట్ వినతికి సుష్మా స్పందించారు
X
ఆ మధ్య బాలీవుడ్ లో ఎయిర్ లిఫ్ట్ సినిమా వచ్చింది. వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో హీరోగా నటించిన అక్షయ్ కుమార్.. తాజాగా తాను నటించిన సినిమాలో లాంటి సీన్ రియల్ గా నెలకొన్న వేళ.. ఈ ఉదంతంపై తక్షణమే స్పందించాలంటూ కేంద్రమంత్రిని ట్వీట్ ద్వారా కోరారు. దీనికి రియాక్ట్ అయిన కేంద్ర విదేశాంగ మంత్రి రియాక్ట్ కావటమే కాదు.. హీరోగారి వినతిని నెరవేర్చే పనిలో ఉన్నట్లుగా వెల్లడించారు.

ఇంతకీ జరిగిందేమంటే.. దక్షిణ సూడాన్ లో ప్రస్తుతం భద్రత బలగాలకు.. ప్రభుత్వ వ్యతిరేక వర్గాలకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని జూబా నగరం అల్లకల్లోలంగా మారింది. దాదాపుగా ఇలాంటి పరిస్థితులే ఉన్న ఎయిర్ లిఫ్ట్ సినిమాలో హీరోగా నటించిన అక్షయ్.. సౌత్ సూడాన్ లో చోటు చేసుకున్న ఉదంతంపై స్పందించాలంటూ కేంద్రాన్ని కోరారు.

ఆయన చేసిన ట్వీట్ పై స్పందించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.. అక్షయ్ కుమార్ ను కంగారు పడొద్దని.. దక్షిణ సూడాన్ లో చిక్కుకున్న భారతీయుల్ని క్షేమంగా తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్విట్టర్ లో బదులిచ్చారు. తాను నటించిన సినిమాలో లాంటి సంఘటనే రియల్ గా చోటు చేసుకున్న వేళ.. రియాక్ట్ అయిన తీరుకు ఆయన్ను మెచ్చుకోవాల్సిందే.