Begin typing your search above and press return to search.

పరిషత్ లో పోటీచేస్తామని అఖిలప్రియ ప్రకటన

By:  Tupaki Desk   |   5 April 2021 8:00 PM IST
పరిషత్ లో పోటీచేస్తామని అఖిలప్రియ ప్రకటన
X
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు మాటను లైట్ తీసుకుంటున్న తెలుగు తమ్ముళ్ల చాలా చోట్ల బరిలో ఉంటున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు వెనక్కి తగ్గేది లేదంటున్నారు.తాజాగా టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ సైతం చంద్రబాబు ఆదేశాలను బుట్టదాఖలు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీచేస్తారని భూమా అఖిల ప్రియ సంచలన ప్రకటన చేశారు.

టీడీపీ తరుఫున బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం చేస్తారని.. వారి తరుఫున తాము కూడా ప్రచారం చేస్తామని అఖిలప్రియ స్పష్టం చేశారు.ప్రజలు టీడీపీ అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఉందని భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ అభ్యర్థులు వైసీపీలో చేరారని.. అలాంటి చోట్ల నోటాకి ఓటు వేయమని ప్రచారం చేస్తామన్నారు.