Begin typing your search above and press return to search.

క‌లిసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చేసిన అఖిల‌

By:  Tupaki Desk   |   18 Aug 2017 4:40 AM GMT
క‌లిసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చేసిన అఖిల‌
X
ఊహించ‌ని రీతిలో నిర్ణ‌యాలు తీసుకొని న‌మ్ముకున్న వారికి షాకులు ఇవ్వ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కొత్తేం కాదు. తాజాగా అదే తీరును మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. ఏం క‌లిసి వ‌స్తుంద‌న్న అంచ‌నానో కానీ.. భూమా వ‌ర్గంలో ఏళ్ల‌కొద్దీ రాజ‌కీయ శ‌త్రుత్వం ఉన్న గంగుల ప్ర‌తాప‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి కండువా వేశార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన నంద్యాల ఉప ఎన్నిక‌ల పోలింగ్‌ కు నాలుగు రోజులు ముందు చోటు చేసుకున్న ప‌రిణామంతో భూమా వ‌ర్గం ఒక్క‌సారి షాక్‌ కు గురైంది.

అస‌లు ఉప ఎన్నిక‌ల టెన్ష‌న్ తో కిందామీదా ప‌డుతున్న మంత్రి భూమా అఖిల‌కు అయితే.. తాజా ప‌రిణామం నుంచి కోలుకోవటం చాలా క‌ష్ట‌మ‌నే మాట వినిపిస్తోంది. నాలుగు రోజుల్లో పోలింగ్ పెట్టుకొని.. భూమా ఫ్యామిలీతో ఏ మాత్రం ప‌డ‌ని గంగుల‌ను పార్టీలోకి తీసుకోవ‌టం ద్వారా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏం సందేశం ఇద్దామ‌నుకున్నారు? అన్న ప్ర‌శ్న‌కు ఎవ‌రూ సంతృప్తిని క‌లిగించే రీతిలో స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు.

ఇక‌.. ఇదే ప్ర‌శ్న‌కు భూమా అఖిల‌ప్రియ అయితే.. త‌న మ‌న‌సులోని అసంతృప్తిని బాహాటంగానే బ‌య‌ట‌పెట్టేసుకున్నారు. తాము క‌ష్ట‌ప‌డేదానికి త‌గ్గ‌ట్లే త‌మ వ‌ర్గం త‌మ‌కు ఉంటుంద‌ని.. వాళ్ల వ‌ర్గం వారికి ఉంటుంద‌న్నారు. ఒక పార్టీలోకి రావ‌టం.. ఒక‌రు పార్టీలో నుంచి వెళ్ల‌టం వ‌ల్ల భూమా కుటుంబానికి.. కార్య‌క‌ర్త‌ల‌కు కానీ ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌ని.. అదే స‌మ‌యంలో ఎలాంటి లాభం ఉండ‌ద‌నీ తేల్చేయ‌టం విశేషం. గంగుల వ‌ర్గం అంటేనే మండిప‌డే భూమా ఫ్యామిలీకి ఇప్పుడు ఒకే పార్టీలో ఇరువురు క‌లిసి ప‌ని చేయ‌టం కుద‌ర‌ని ప‌ని అన్న విష‌యాన్ని అఖిల ప్రియ త‌న మాట‌ల‌తో తేల్చేశారు.

నాలుగు రోజుల్లో పోలింగ్ ఉన్న వేళ‌.. ఇప్పుడు గంగుల‌ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తాను అనుకోవ‌టం లేద‌ని.. గంగుల వ‌స్తున్న‌ది త‌న వ్య‌క్తిగ‌తం కోస‌మే త‌ప్పించి.. ఉప ఎన్నిక కోసం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కాద‌న్నారు. ఒక‌వేళ ఉప ఎన్నిక కోస‌మే అయితే.. ఆయ‌న ఎప్పుడో వ‌చ్చే వార‌న్న అఖిల‌ప్రియ‌.. త‌మ రెండు వ‌ర్గాలు ఎక్క‌డా గొడ‌వ ప‌డ‌వ‌ని.. అదే స‌మ‌యంలో క‌లిసి ప‌ని చేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చేశారు. ఇంత సూటిగా.. స్ప‌ష్టంగా మాట చెప్పేసిన త‌ర్వాత‌.. రెండు వ‌ర్గాల మ‌ధ్య ఉన్న శ‌త్రుత్వం పార్టీకి కొత్త స‌మ‌స్య‌ల్ని తెచ్చి పెట్ట‌టం ఖాయ‌మంటున్నారు. ఏమైనా.. గంగుల చేరిక విష‌యంలో బాబు చేయ‌కూడ‌ని త‌ప్పు చేశారంటున్నారు. గంగుల‌ను తీసుకురావ‌టం ద్వారా అఖిల ప్రియకు షాక్ ఇవ్వ‌ట‌మే కాదు.. రానున్న రోజుల్లో గంగుల‌కు అసంతృప్తి క‌లిగిచ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తుంది. దీనికి తాజాగా అఖిల‌ప్రియ చేసిన వ్యాఖ్య‌లు శాంపిల్ మాత్ర‌మేన‌ని అంటున్నారు.