Begin typing your search above and press return to search.

ఫేక్ బాబాల రెండో జాబితా ఇదే!

By:  Tupaki Desk   |   31 Dec 2017 5:21 PM IST
ఫేక్ బాబాల రెండో జాబితా ఇదే!
X
డేరా బాబాగా పేరొంది... స‌న్మార్గం కోస‌మంటూ ఏర్పాటు చేసుకున్న ఆశ్ర‌మాన్ని అడ్డాగా చేసుకుని శ‌ర‌ణు వేడి వ‌చ్చిన మ‌హిళ‌లు - సాధ్వీలపై అత్యాచారాల ప‌రంప‌ర‌కు బ‌రి తెగించిన గుర్మీత్ రాం ర‌హిమ్ సింగ్ ఉదంతం మొన్నామ‌ధ్య యావ‌త్తు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. అంత‌కుముందు న‌కిలీ బాబాలు ఎంత‌మంది వెలుగు చూసినా స్పందించని ప్ర‌భుత్వాలు కాస్తంత క‌ఠినంగానే స్పందించాల్సి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో హిందూ సాధువుల అపెక్స్ బాడీగా పేరొందిన అఖాడా ప‌రిష‌త్ కూడా రంగంలోకి దిగిపోయింది.

ఇక‌పై ఫేక్ బాబాలు - న‌కిలీ బాబాల బారిన ప‌డి మోస‌పోకుండా జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసే ప‌నిని అఖాడా ప‌రిష‌త్ మొద‌లెట్టింది. ఈ క్ర‌మంలో మొన్నామ‌ధ్య 14 మంది న‌కిలీ బాబాల జాబితాను విడుద‌ల చేసిన అఖాడా ప‌రిష‌త్‌... తాజాగా నేటి ఉద‌యం మ‌రో జాబితాను విడుద‌ల చేసింది. సెకండ్ లిస్ట్‌ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ జాబితాలో ముగ్గురు ఫేక్ బాబాలున్నార‌ట‌. వీరు ఎవ‌ర‌న్న విష‌యానికి వస్తే... వీరేంద్ర దేవ్ దీక్షిత్ (ఢిల్లీ) - సచ్చిదానంద సరస్వతి (బస్తి - యూపీ) - త్రికాల్ భావంత్ (అలహాబాద్)లు ఈ జాబితాలో ఉన్నారు.

ఇక గ‌తేడాది సెప్టెంబ‌రులో విడుద‌లైన తొలి జాబితాలో ఉన్న 14 మంది ఫేక్ బాబాల విష‌యానికి వ‌స్తే.. ఆశారాం బాపు - రాధే మా, -సచ్చిదానంద గిరి - గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ - స్వామి ఓంజీ - నిర్మల్ బాబా - ఇచ్చధారి భీమానంద్ - స్వామి అసీమానంద - నారాయణ సాయి - రాంపాల్ - ఆచార్య కుష్ ముని - బృహస్పతి గిరి - ఓం నమ: శివాయ బాబా - మల్కన్ సింగ్ లు ఆ జాబితాలో ఉన్నారు. మొత్తంగా అఖాడా ప‌రిష‌త్ విడుద‌ల చేసిన ఈ రెండు జాబితాల్లో దేశం మొత్తం మీద 17 మంది న‌కిలీ బాబాలు ఉన్న‌ట్లుగా అధికారికంగా ప్ర‌క‌టించిన‌ట్టైంది.