Begin typing your search above and press return to search.

అక్బ‌రుద్దీన్‌ కు అస్వ‌స్థ‌త‌... ఆస్ప‌త్రిలో చేరిక‌

By:  Tupaki Desk   |   22 Dec 2018 5:06 PM IST
అక్బ‌రుద్దీన్‌ కు అస్వ‌స్థ‌త‌... ఆస్ప‌త్రిలో చేరిక‌
X
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అస్వ‌స్థ‌త పాల‌య్యారు. డిసెంబర్ 21 రాత్రి తీవ్రమైన కడుపునొప్పి బాధపతున్న ఆయన్ని సన్నిహితులు, కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని డాక్టర్స్ తెలిపారు. కాగా గత కొంతకాలం క్రితం అక్భరుద్ధీన్ పై హత్యా యత్నం సందర్భంగా జరిగిన గాయాలు.. శరీరంలో వుండిపోయిన కొన్ని అవశేషాల కారణంగా ఆయన తరచు అనారోగ్యానికి గురవుతున్న విషయం తెలిసిందే.

ఎన్నికల సందర్భంగా ప్రచారంలో అక్భరుద్దీన్ ఆరోగ్యం విషయంలో మాట్లాడుతు.. ‘కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాననీ.. తన కిడ్నీలు పూర్తిగా పాడయిపోయాయనీ.. కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఇంకా వుండటంతో తరచు అనారోగ్యం వస్తోంది. దీంతో ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.. దీని కోసం డయాలసిస్ చేయించకోవాలని డాక్టర్స్ కూడా సూచించారు. ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’ అని అక్భరుద్ధీన్ వ్యాఖ్యానించటం ఆయన ఆరోగ్య పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణ గుట్ట నుంచి ఘనవిజయం సాధించిన సంగ‌తి తెలిసిందే.