Begin typing your search above and press return to search.

అంబానీ ఇంట పెళ్లి శుభ‌లేఖ బ‌య‌ట‌కొచ్చింది!

By:  Tupaki Desk   |   14 Feb 2019 11:35 AM GMT
అంబానీ ఇంట పెళ్లి శుభ‌లేఖ బ‌య‌ట‌కొచ్చింది!
X
ఇవాల్టి రోజున సామాన్యుడు సైతం త‌న ఇంట జ‌రిగే పెళ్లిని గ్రాండ్ గా చేయాల‌ని త‌పించే ప‌రిస్థితి. త‌మ స్థాయికి త‌గ్గ‌కుండానే కాదు.. కొంద‌రైతే ఏకంగా త‌మ స్థాయికి మించి మ‌రీ పెళ్లి వేడుక‌ల్ని చేస్తున్నారు. ఇలాంటివేళ‌.. ప్ర‌పంచ టాప్ కుబేరుల్లో ఒక‌రు.. భార‌త్ లో నెంబ‌ర్ వ‌న్ సంప‌న్నుడైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి అంటే మాట‌లా? ఆ వేడుక ఎంత గ్రాండ్ గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఇప్ప‌టికే ముకేశ్‌.. నీతా అంబానీల గారాల‌ప‌ట్టి ఈశా వివాహ వేడుక‌ల‌కు సంబంధించిన శుభ‌లేఖ ఆన్ లైన్లో వైర‌ల్ గా మారింది.ఇప్ప‌టికే ఎంగేంజ్ మెంట్ సంద‌ర్భంగా చేసిన సంద‌డిని క‌థ‌లు.. క‌థ‌లుగా చెప్పుకున్న వేళ‌.. రానున్న రోజుల్లో జ‌రిగే పెళ్లి ఏర్పాట్లు ఎంత ఘ‌నంగా ఉండ‌నున్నాయ‌న్న విష‌యం.. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన శుభ‌లేఖ‌ను చూస్తేనే అర్థ‌మ‌వుతుంది.

మార్చి 9న జియో వ‌ర‌ల్డ్ సెంట‌ర్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ వివాహ వేడుకకు సంబంధించిన మొద‌టి శుభ‌లేఖ ముంబ‌యిలోని సిద్ది వినాయ‌క ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయిస్తున్నారు. మొద‌టి శుభ‌లేఖ అక్క‌డ ఇచ్చిన త‌ర్వాత అతిధుల‌కు ఆహ్వానాలు పంప‌నున్నారు. పెళ్లి శుభ‌లేఖ విష‌యానికి వ‌స్తే.. గ్రాండ్ గా డిజైన్ చేసిన ఒక పెద్ద పెట్టెలో శుభ‌లేఖ‌ను అందిస్తున్నారు. అందులో ఒక ఖ‌రీదైన ఫోటో ప్రేమ్‌.. ఒక స్థాయి అల్బ‌మ్ లాంటి ఆహ్వాన‌ప‌త్రిక‌ను అందిస్తున్నారు.

ఇందులో త‌మ కుమార్తె పెళ్లి విష‌యాన్ని త‌మ స్వ‌హ‌స్తాల‌తో రాసి సంత‌కం చేసిన ప్ర‌తితో పాటు.. పెళ్లి సంద‌ర్భంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలు.. వాటి టైమింగ్స్‌.. పెళ్లి సంద‌ర్భంగా ఇచ్చే బ‌హుమ‌తుల వివ‌రాల్ని పేర్కొన్నారు. ఇక‌.. శుభ‌లేఖ ను చూస్తున్న వేళ‌.. కృష్ణుడు.. గ‌ణ‌ప‌తి పాట‌లు బ్యాక్ గ్రౌం్ లో వినిపిస్తూ ఉండ‌టం విశేషం. కొండ మీద కోతినైనా తేగ‌లిగిన స‌త్తా ఉన్న అంబానీ ఇంట పెళ్లి హ‌డావుడి ఈ మాత్రం లేకుంటే ఎలా?