Begin typing your search above and press return to search.

ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ దుమ్ము రేపుతోంది

By:  Tupaki Desk   |   3 July 2017 7:48 AM GMT
ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ దుమ్ము రేపుతోంది
X
మెర్సిడెస్‌ బెంజ్ కారుకు ఉన్న క్రేజ్ - దానిలోని ప్ర‌త్యేక‌త‌ల‌ను గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇలాంటి ఎన్నో విశిష్ట‌త‌ల‌కు బుల్లెట్ ప్రూఫ్ అనే ప్ర‌త్యేక క‌వ‌చం కూడా తోడ‌యితే...ఇంకేముంది. అలాంటి కారు ఎంద‌రికో ఆస‌క్తిక‌రంగా మారుతుంది. అలా తీసుకువ‌చ్చిన త‌మ కొత్త మోడ‌ల్ బుల్లెట్ ప్రూఫ్‌ ను తాజాగా మెర్సిడెస్ సంస్థ ఓ డెమో వీడియో రూపంలో వినియోగ‌దారుల‌కు చేరువ చేసింది. అనేక‌మంది బెంజ్ అభిమానులు ఈ కొత్త మాడ‌ల్‌ పై క్రేజ్‌ను పెంచింది.

బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్కెట్లోకి విడుద‌ల చేసిన‌ట్లు కేవ‌లం ఒక ప్ర‌క‌ట‌న చేసి మాత్ర‌మే బెంజ్ సంస్థ ఊరుకోలేదు. త‌మ కారు ఎలా తుపాకి గుళ్ల‌ను సైతం ఎదుర్కోగ‌లుగుతుందో ప్ర‌ద‌ర్శించింది. ఆ డెమో వీడియో ప్ర‌కారం బెంజ్ సంస్థ ప్ర‌తినిధిని కారులో కూర్చోబెట్టి మ‌రీ స‌ద‌రు వాహ‌నం పైకి ఏకే 47తో కాల్పులు జ‌రిపారు. అలా తుపాకి గుళ్లు వ‌దిలిన‌ప్ప‌టికీ కారుకు ఏం కాలేదు. మ‌హా అయితే కారు అద్దాలు ప‌గులుతాయో కానీ అందులో ప్ర‌యాణికులు మాత్రం సేఫ్‌గా ఉంటార‌ని బెంజ్ సంస్థ ఢంకా భ‌జాయించి మ‌రీ చెప్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/