Begin typing your search above and press return to search.

భార‌త్‌-చైనా పేచీపై హైద‌రాబాద్‌ లో క్లారిటీ

By:  Tupaki Desk   |   30 Oct 2016 10:01 AM GMT
భార‌త్‌-చైనా పేచీపై హైద‌రాబాద్‌ లో క్లారిటీ
X
హైద‌రాబాదీలుగా అంతా సంతోషించాల్సిన వార్త ఇది. భార‌త‌దేశానికి సంబంధించిన కీల‌క అంశంపై తుది క్లారిటీ హైద‌రాబాద్ లో జ‌రిగే చ‌ర్చ ద్వారా తేల‌నుంది. అణు సరఫరా బృందంలో ఇండియా ప్రవేశం - ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ పై ఐక్యరాజ్యసమితి నిషేధం వంటి అంశాలపై విభేదాల కారణంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకొనే లక్ష్యంతో భారత - చైనా దేశాల జాతీయ భద్రతా సలహాదార్లు అజిత్ దోవల్ - యాంగ్ జియెచీ వచ్చేవారం భాగ్య‌న‌గ‌రంలో భేటీ కానున్నారు.

హైదరాబాద్‌ లో జరుగునున్న ఈ సమావేశంలో ఈ ఇద్ద‌రు అగ్ర‌నేత‌లు రెండు దేశాల‌ సంబంధాల అభివృద్ధికి అడ్డుపడుతున్న సమస్యలపై దృష్టి పెడుతారని బీజింగ్‌ లోని అధికారవర్గాలు తెలిపాయి. ఇటీవల చైనా సరుకులపై నిషేధం విధించాలన్న డిమాండ్లు రావడం - భారత్‌ లోని అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ అరుణాచల్‌ ప్రదేశ్ సందర్శించడం వంటి అంశాలపై చైనా అభ్యంతరాలు చెప్తున్నది. అమెరికా - జపాన్‌ లతో ఇండియా వ్యూహాత్మకంగా దగ్గర కావడంపై కూడా చైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ అంశాలన్నిటిపైనా దోవల్ - యాంగ్ లోతుగా చర్చిస్తారని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/