Begin typing your search above and press return to search.

అజిత్ దోవల్ స్కెచ్.. మోడీ అమలు

By:  Tupaki Desk   |   5 Oct 2019 6:55 AM GMT
అజిత్ దోవల్ స్కెచ్.. మోడీ అమలు
X
తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సౌదీ అరేబియాలో పర్యటించారు. ఆ దేశ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అదే సమయంలో కశ్మీర్ విభజనపై క్లారిటీ ఇచ్చారు. దీంతో కశ్మీర్ విషయంలో భారత్ కు మద్దతిచ్చింది సౌదీ అరేబియా.

అయితే తాజాగా అజిత్ దోవల్.. సౌదీతో పలు కీలక ఒప్పందాలు చేసుకునేందుకు మార్గం సుగమం చేశారు. త్వరలోనే భారత ప్రధాని నరేంద్రమోడీ సౌదీ పర్యటనను ఖరారు చేశారు. సౌదీలో జరిగే గల్ఫ్ దేశాల పెట్టుబడుల సదస్సులో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనేందుకు మార్గం సుగమం చేశారు. దీని ద్వారా పెద్ద ఎత్తున భారత్ లో పెట్టుబడులకు గల్ఫ్ దేశాలు ఒప్పుకునేలా సౌదీ రాజుతో మంత్రాంగం నడిపారు. సౌదీరాజు ఓకే చెప్పడంతో ప్రధాని నరేంద్రమోడీ సౌదీ పర్యటన ఖరారు అయినట్టు సమాచారం.

2016లో సౌదీలో పర్యటించిన మోడీ తాజాగా మరోసారి పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోనే ఆయిల్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా.. రిఫైనరింగ్, ఎనర్జీ, మానవ వనరుల రంగాల్లో 100 బిలియన్ అమెరికన్ డాలర్లను పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ పెట్టుబడులను ఆకర్షించేందుకు.. భారత్ లోని పలు సంస్థలతో సౌదీ అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఆర్మ్ కో భాగస్వామ్యం కల్పించేందుకు మోడీ ఈ పర్యటన పెట్టుకున్నట్టు తెలిసింది.