Begin typing your search above and press return to search.

పాక్ కు ధోవల్ మార్క్ పంచ్

By:  Tupaki Desk   |   8 Aug 2019 11:24 AM GMT
పాక్ కు ధోవల్ మార్క్ పంచ్
X
కశ్మీర్ కు స్వయంప్రతిపత్తి రద్దు, విడగొట్టి కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన భారత్ పై పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఇప్పటికే వాణిజ్య, దౌత్య సంబంధాలను తెంచుకుంది. ఇక గురువారం భారత్-పాకిస్తాన్ ల మధ్య నడిచే సంఝౌత ఎక్స్ ప్రెస్ ను నిలిపివేసింది. ఇక భారతీయ సినిమాలు పాకిస్తాన్ లో బహిష్కరించింది.

గురువారం భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగించే సంఝౌత ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేసినట్లు పాక్ మీడియాలో వార్తలు రావడం సంచలనమైంది. 1979లో సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌత ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించి భారత్-పాకిస్తాన్ ల మధ్యన రాకపోకలు సాగిస్తున్నారు. వారానికి ఒకటి చొప్పున ఢిల్లీ నుంచి లాహోర్ కు ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. కశ్మీర్ వివాదం నేపథ్యంలో ఈ రైలును పాకిస్తాన్ నిలిపివేసినట్లు సమాచారం.

కాగా బలమైన భారత్ తో వాణిజ్య సంబంధాలను పాకిస్తాన్ తెంచుకోవడం వల్ల పాకిస్తానే నష్టమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేశారు. ఒక్క కూరగాయలు, నిత్యావసరాల దిగుమతి తప్పితే పాకిస్తాన్ నుంచి ఏమీ మనకు దిగుమతి కావు. అదే సమయంలో భారత్ నుంచి పాక్ కు పెద్దగా ఎగుమతులు లేవు.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవడంపై తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ట్వీట్ చేశారు.పాకిస్తాన్ నిర్ణయంపై అదిరిపాయే సెటైర్లు వేశారు.

‘పాకిస్తాన్ భారత్ తో వాణిజ్య సంబంధాలు తెంచుకోవడం భారత్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం.. ఎంతంటే విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రాం లో ఒక వాణిజ్య ప్రకటన చేయాలంటే ఎంత వసూలు చేస్తాడో అంత నష్టం.. ఇది చాలా బాధాకరం.. ఈ భారీ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో..’ అంటూ అజిత్ ధోవల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలా పాకిస్తాన్ బెదిరింపులను ధోవల్ కూరలో కరివేపాకులా తీసేశాడని నెటిజన్లు కామెంట్చేస్తున్నారు.